బిజినెస్Discount Offer on Cars: ఈ కారుపై రూ.1.03 లక్షల డిస్కౌంట్.. జూలై 15 లోపే.....

Discount Offer on Cars: ఈ కారుపై రూ.1.03 లక్షల డిస్కౌంట్.. జూలై 15 లోపే.. త్వరపడండి

Discount Offer on Cars: ప్రస్తుత కాలంలో సొంత కారు ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో లోబడ్జెట్ , డిస్కౌంట్ వచ్చే కార్ల కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లోనే ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటాయి. కానీ కొన్ని కార్ల కంపెనీలు సేల్స్ పెంచుకునేందుకు సాధారణ రోజుల్లో కూడా తగ్గంపు ధరతో విక్రయిస్తుంటాయి. తాజాగా మారుతి కంపెనీకి చెందిన కొన్ని కార్లపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించాయి. అయితే ఈ ఆఫర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జూలై 15 వరకు గడువు ఉండనుంది. ఆ వివరాల్లోకి వెళితే..

మారుతి కంపెనీకి చెందిన బాలెనో బెస్ట్ సీఎన్ జీ కారుగా నిలుస్తోంది. ఈ కారు ధర ప్రస్తుతం రూ.6.66 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దీనిపై మొత్తం 57 వేల డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇందులో నగదు డిస్కౌంట్ రూ.40 వేలు, ఎక్చేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, కార్పొరేట్ రిటర్న్స్ రూ.2,100 ఉన్నాయి.

ఇదే కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా పై లక్షకు పైగా ప్రయోజనాలు పొందవచ్చు. వీటిలో రూ. 50 వేలు నగదు డిస్కౌంట్, ఎక్చేంజ్ బోనస్ కింద రూ.50 వేలు, కార్పొరేట్ ఆఫర్ రూ.3,100 ఉన్నాయి. మొత్తంగా రూ.1.03 లక్షల వరకు డిస్కౌంట్ పొందుతారు. ప్రస్తుతం దీనిని రూ.11 లక్షలతో విక్రయిస్తున్నారు.

మహీంద్రా థార్ కు పోటీగా మారుతి జిమ్నీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కారుపై డిస్కౌంట్ ను ప్రకటించారు. ప్రస్తుతం దీనిని రూ.12.74 లక్షలతో విక్రయిస్తుండగా రూ.2.5 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందించనున్నారు. అయితే ఈ డిస్కౌంట్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది.

సియాజ్ కారు ధర మార్కెట్లో రూ.9.4 లక్షలుగా ఉంది. దీనిపై రూ.48 వేల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో నగదు డిస్కౌంట్ రూ.20 వేల వరకు అందిస్తున్నారు. అలాగే రూ.25 వేల ఎక్చేంజ్ బోనస్, రూ.3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఇవ్వనున్నారు.

మారుతి ఇగ్నిస్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది మార్కెట్లో రూ.5.84 లక్షలతో అమ్మకానికి సిద్ధంగా ఉంది. అయితే దీనిపై రూ.55 వేల డిస్కౌంట్ ను ప్రకటించారు. ఇందులో ఎక్చేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, నగదు డిస్కౌంట్ రూ.40 వేల వరకు అందించనున్నారు.

ఎక్స్ ఎల్ 6 కారుపై ఆఫర్లు ప్రకటించారు. దీనిని కొనుగోలుచేసిన వారికి రూ.40 వేల ప్రయోజనాలు కల్పించనున్నారు. ఇందులో నగదు డిస్కౌంట్ రూ.20 వేలు, ఎక్చేంజ్ బోనస్ కింద రూ.20 వేలు అందించనున్నారు. ప్రస్తుతం దీనిని రూ.11.51 లక్షలతో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Top 5 SUVs India 2026: బెస్ట్ రోడ్ క్లియరెన్స్ కలిగిన టాప్ 5 పాపులర్ SUVలు ఇవే..

Top 5 SUVs India 2026: భారతీయ రహదారుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నగరాల్లోని భారీ స్పీడ్ బ్రేకర్లు, వర్షాకాలం వస్తే రోడ్లపై నిలిచే నీరు నిలవడం వంటి...

Maruti: మారుతి వెబ్‌సైట్‌లో గ్రాండ్ విటారా సీఎన్‌జీ మాయం.. అసలేమైందంటే ?

Maruti మారుతి గ్రాండ్ విటారా సీఎన్‌జీ వేరియంట్ బుకింగ్ కోసం మీరు నెక్సా వెబ్‌సైట్‌ను కొంచెం వెతకాలి. ఈ సైట్‌లో రిజర్వేషన్ విభాగం ఉంది.

Most Popular

Tata Avinya X

Tata Avinya X: ఈ టాటా కారు డిజైన్ గురించి తెలిస్తే క్యూ కట్టకుండా ఉండరు..

Tata Avinya X: భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక 'టాటా అవిన్యా ఎక్స్' ఈవీ కారును భారత రోడ్లపై రోడ్ టెస్టింగ్...
Honor X7e Plus 5G

Honor X7e Plus 5G: ఈ ఫోన్ ఎక్కువ సేపు చూసినా కళ్లకు అలసట కలగదు.. ఎందుకంటే..

Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ 'ఎక్స్ సిరీస్'లో భాగంగా 'హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది....
Mahindra Vision T

Mahindra Vision T: మహీంద్రా మరో సంచలనం.. విజన్.T కి భారత్‌లో పేటెంట్.. ఇది ఎలా ఉండబోతుందంటే..

Mahindra Vision T: SUV కార్లను తీసుకురావడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లతో అలరించిన ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ విషయంలోనూ తనదే...
Jio

Jio: జియో వాడుతూ మనం కంపెనీకి ఎంత నెల ఇస్తున్నామో తెలుసా

Jio: రిలయన్స్‌ లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ సంస్థ అధినేత అనిల్‌ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడు. రిలయన్స్‌ సంస్థ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసిక...
Oneplus 15 Oneplus 15R

OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి OnePlus ఎగ్జిట్.. మరి భారత్ లో..

OnePlus : ప్రముఖ మొబైల్ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మార్కెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన 'ఒప్పో' (Oppo) తన గ్లోబల్ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో...