Salman Khan Marriage: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి దాదాపు అన్ని ఇండస్ట్రీల ప్రజలకు తెలుసు. ఈ స్టార్ నటుడికి ఫుల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక తెలుగులో కూడా అభిమానులు ఎక్కువేనండోయ్. అయితే ఇన్ని సంవత్సరాల వయసు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోలేదు కండల వీరుడు. ఇంత వయసు వచ్చినా సరే ఒంటరిగానే ఉంటూ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అయితే రీసెంట్ గా సల్మాన్ ఖాన్ మాట్లాడిన కొన్ని మాటలు వైరల్ గా మారాయి. తన ఫుడ్ గురించి, పెళ్లి గురించి మాట్లాడాడు సల్మాన్. ఇంతకీ ఏం అన్నారంటే?
Also Read: వళ్ళు విల్లులా వంచి పవన్ హీరోయిన్ యోగా భంగిమలు… ప్రణీత సుభాష్ టాలెంటెడ్ చూశారా?
సల్మాన్ ఖాన్ తన ఫిట్‌నెస్ కు ఫుల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాదు తన స్టైల్, ముక్కుసూటితనానికి కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ కొత్త సీజన్ మొదటి ఎపిసోడ్‌లో చూశారా? అందులో కనిపించారు సల్మాన్ ఖాన్. సల్మాన్‌తో పాటు , కపిల్ శర్మ, అర్చన పురాన్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధు, సునీల్ గ్రోవర్, కృష్ణ అభిషేక్, కికు శారద వంటి అనేక మంది నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ షోలో కనిపించిన సల్లూ భాయ్ ఫుల్ ఫిట్ గా కనిపించాడు. అందుకే దానికి సంబంధించిన ప్రశ్న రానే వచ్చింది. మరి సమాధానం ఏంటంటే?
ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ తన గురించి మాత్రమే కాదు. తన తండ్రి సలీం ఖాన్ ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి కూడా మాట్లాడారు. తన తండ్రి వయసు ఇప్పుడు 89 సంవత్సరాలు. ఇప్పటికీ తన తండ్రి ప్రతి ఉదయం బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో వాకింగ్ కు వెళ్తారట. అంతేకాదు సల్మాన్ నవ్వుతూ, ‘బాబా ఆకలి ఇప్పుడు తగ్గిందని కానీ ఇప్పటికీ రోజుకు రెండుసార్లు మాత్రమే తింటారు అని చెప్పారు. అందులో కూడా కేవలం పరాఠాలు, రైస్, మాంసం, స్వీట్లు తింటాడు అని తెలిపారు. అంతేకాదు తన తండ్రి జీవక్రియ, క్రమశిక్షణ రెండూ అద్భుతమైనవి అంటూ కొనియాడారు.
Also Read: పవన్ కళ్యాణ్ కోసం ప్రముఖ నటి పాకీజా పడిగాపులు! అసలేమైంది?
ఆ తర్వాత సల్మాన్ తన ఆహారం, ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ.. తాను ఏది కావాలంటే అది తింటానని, కానీ ఎప్పుడూ ఎక్కువగా తిననని చెప్పాడు. ‘అంతేకాదు ఒకటి లేదా ఒకటిన్నర చెంచాల అన్నం మాత్రమే తింటారట. ఏదైనా కూరగాయలు, చికెన్, మటన్ లేదా చేపలు తింటారట సల్లూ భాయ్. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. సింగిల్ గా సంతోషంగా ఉన్నాను. పెళ్లి గురించి ఆలోచించడం లేదు అన్నారు. ఇక ఈ 59ఏళ్లు వచ్చినా కూడా సల్మాన్ ఖాన్ పెళ్లికి దూరంగా ఉండటమే అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.