Actress Pakeezah Vasuki: సినీ నటులది విలాసవంతమైన జీవితాలని మనం అనుకుంటూ ఉంటాము. నిజమే సినీ ఇండస్ట్రీ లో సక్సెస్ అయిన వాళ్లకు కలలో కూడా ఊహించని జీవితం కళ్ళ ముందుకొస్తుంది. కానీ సినీ ఇండస్ట్రీ లో సక్సెస్ అవ్వకపోతే మాత్రం చాలా ఘోరమైన పరిణామాలను ఎదురుకోవాల్సి వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ సపోర్టుతో వచ్చిన వాడు ఇండస్ట్రీ లో సక్సెస్ అవ్వకపోతే వేరే వ్యాపారం ఏదైనా చూసుకుంటారు. కానీ ఆర్ధిక స్తొమత లేక, ఎదో అదృష్టం కలిసొచ్చి ఒక సినిమాలో అవకాశం వచ్చిన తర్వాత ఆ క్యారక్టర్ బాగా వైరలై , తద్వారా కొన్ని సినిమాల్లో అవకాశాలు సంపాదించి మళ్ళీ ఫేడ్ అవుట్ అయిపోయిన క్యారక్టర్ ఆర్టిస్టులు మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. వీళ్ళలో కొంతమందికి అయితే పూట కూడా గడవని పరిస్థితి ఉంది. అలాంటి వారిలో ఒకరు పాకీజా.
ఎక్కడో ఈ పేరు విన్నట్టు ఉంది కదూ, పెద్ద రాయుడు చిత్రం ద్వారా ఈ క్యారక్టర్ ఆరోజుల్లో బాగా హైలైట్ అయ్యింది. ఈ క్యారక్టర్ పోషించిన నటి పేరు వాసుగి. ఈమె తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ఇప్పుడు ఈమెకు అవకాశాలు రావడం లేదు. ఏదైనా పని చేసుకుందాం అనుకుంటే పని ఇచ్చేవాళ్ళు కూడా కరువు అయ్యారు. దీంతో పూట కూడా గడవలేని స్థితిలో పడింది. ఈమె దయనీయమైన పరిస్థితి తెలుసుకొని గతం లో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు ఆర్ధిక సాయం చేశారు. కానీ వాటిని ఆమె తన అమ్మ క్యాన్సర్ చికిత్స కోసం వినియోగించింది. ఇప్పుడు ఆమె ఆర్ధిక పరిస్థితి మరింత దీనమైన స్థితికి రావడం తో సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను కలిసేందుకు గుంటూరు కి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ‘నా దుస్థితిని ని తమిళ సినిమా ఇండస్ట్రీ అసలు పట్టించుకోలేదు. ఎంతో మందిని కలిసే ప్రయత్నం చేసిన సహాయం అందలేదు. నా గురించి తెలుసుకొని చిరంజీవి(Megastar Chiranjeevi),నాగబాబు(Konidela Nagababu) ఆదుకున్నారు. కానీ ఇప్పుడు మరింత దీనమైన స్థితికి వచ్చాను. చంద్రబాబు(CM Chandrababu Naidu), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లు నా పరిస్థితి ని అర్థం చేసుకొని ప్రతీ నెల పెన్షన్ వచ్చేలా చెయ్యాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒక నాటికీ ఇలాంటి పరిస్థితి రావడంపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మాట్లాడే దానిని బట్టి చూస్తుంటే ఆమె తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళగా అనిపించడం లేదు. తమిళనాడుకు చెందిన మహిళగా అనిపిస్తుంది. కాబట్టి ఆమెకు ఆంధ్ర ప్రదేశ్ లో ఉండే పధకాలు పొందే అర్హత ఉండకపోవచ్చు. కానీ చంద్రబాబు,పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే కచ్చితంగా ఈమెకు ఎదో ఒక విధంగా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి.