Naga Chaitanya Comments On Sobhitha: టాలీవుడ్ లో మోస్ట్ ట్రెండింగ్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), శోభిత(Sobhitha Dhulipalla) పేర్లు కచ్చితంగా ఉంటాయి. వీళ్లిద్దరు గత ఏడాది డిసెంబర్ నెలలో అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలకు వెళ్లకుండా చాలా సాధారణంగా , బంధు మిత్రుల మధ్య గ్రాండ్ గా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి. ఇకపోతే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నాగ చైతన్య శోభిత గురించి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘పెళ్లి కి ముందు నేను,శోభిత కొన్ని విషయాల్లో అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదని నియమాలు పెట్టుకున్నాము. మేమిద్దరం కెరీర్ పరంగా బిజీ ఆర్టిస్టులం. ఎప్పుడూ షూటింగ్స్ లోనే గడుపుతూ ఉంటాము’.
‘చాలా మంది సెలెబ్రిటీలు ఇలా బిజీ అవ్వడం వల్ల రిలేషన్ లో బాగా వెనకబడుతున్నారు. మా మధ్య అలాంటి దూరం ఉండడకూడదు అని పెళ్ళికి ముందే నిర్ణయించుకున్నాం. ఒకవేళ మేమిద్దరం హైదరాబాద్ లో ఉంటే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిసే చేయాలని ఒక కండీషన్ పెట్టుకున్నాం. అదే విధంగా వారం మొత్తం ఎన్ని పనులున్నా, ఆదివారం మాత్రం మేమిద్దరం ఎలాంటి వ్యక్తిగత ప్రోగ్రామ్స్ కానీ, షూటింగ్స్ ని కూడా పెట్టుకోకూడదు అని మరో స్ట్రిక్ట్ రూల్ పెట్టుకున్నాం. ఆ ఒక్క రోజు మాకు ఇష్టమొచ్చినట్టు, ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చెయ్యాలి, తినాలి అనుకున్నాం. ఆ ఆదివారాల్లో వచ్చే మధురమైన జ్ఞాపకాలను మా జీవితాంతం గుర్తించుకోవాలని అనుకున్నాం. శోభిత ఒక పుస్తకాల పురుగు. ఖాళీ దొరికితే చాలు పుస్తకాలు చదువుతూ ఉంటాడు. నాకేమో రేసింగ్ అంటే పిచ్చి. ఇటీవలే ఒక రేస్ ట్రాక్ పై ఆమెకి రేసింగ్ నేర్పించాను. అందుకు ఆమె ఎంతో మురిసిపోయింది’.
‘సెలవు దినాల్లో కచ్చితంగా ట్రిప్స్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నాము. ఒకసారి నేను ప్లాన్ చేసిన ప్రదేశానికి వెళ్తే, మరో సారి శోభిత ప్లాన్ చేసిన ప్రదేశానికి వెళ్ళాలి. ఇవన్నీ మేము పెళ్ళికి ముందే నిర్ణయించుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికి వస్తే వరుస ఫ్లాప్స్ లో ఉన్న నాగచైతన్య రీసెంట్ గానే ‘తండేల్’ అనే చిత్రం తో ఈ ఏడాది మన ముందుకొచ్చి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ తో ఒక మిస్టిక్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక శోభిత విషయానికి వస్తే ఈమె తదుపరి చిత్రాలపై ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ, ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఫోటో షూట్స్ ని అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వాటికి యూత్ ఆడియన్స్ నుండి వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదు.