Bollywood Flops: బాలీవుడ్.. దేశంలో అత్యంత ఖరీదైన, సక్సెస్‌రేటు ఉన్న ఇండస్ట్రీ.. ఇది ఏడాది క్రితం వరకు.. ప్రస్తుతం ఆ ఇండస్ట్రీ ప్లాప్ షోలతో చతికిలబడుతోంది. సక్సెస్ కోసం ఎదురు చూసి చూసీ నిర్మాతలు, హీరోల ముఖం వాచిపోతోంది. కానీ ప్రేక్షకులు మాత్రం సినిమాలను ఆదరించడం లేదు. అయితే కర్ణుడి చావరకు వంద కారణాలు అన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ ప్లాప్ షోకు అనేక కరణాలు ఉన్నాయంటున్నారు సినీ విమర్శకులు.
బాలీవుడ్ మార్కెట్లో సౌత్ ఇండియా సినిమాల హవా..
బాలీవుడ్ సినిమాల ప్లాప్‌లో హిదీ సినిమా ట్రెడిషనల్ మార్కెటలో సైత్ ఇండియా సినిమాలు సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలు హిందీ ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలే ఇందకు ఉదాహరణ. ఒకానొక దశలో దేశ సినీ ఇండస్ట్రీని శాసించేది. దీంతో సౌత్ ఇండియా నటులు, హీరోలు బాలీవుడ్లో ఎంట్రీ కోసం ప్రయత్నించేవారు. కొంతమంది ఎంట్రీ ఇచ్చినా.. పెద్దగా సక్సెస్ కాలేదు. తెలుగు మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ పరిస్థితి తప్పలేదు. ఇక సౌత్ ఇండియా నిర్మాతలు బాలీవుడ్ హీరోయిన్స్ డేట్స్ కోసం ముంబయ్ చుట్టూ తిరిగేవారు. డేడ్స్ కోసం సినిమా షూటింగ్స్ వాయిదా వేసేవారు.
బాలీవుడ్లో ఒకప్పుడు బ్రహ్మాండమైన సినిమాలు..
బాలీవుడ్లో ఒకప్పుడు మంచి సినిమాలు వచ్చాయి. హిదీ మార్కెట్‌తోపాటు సౌత్ ఇండియా మార్కెట్‌ను కూడా షేక్ చేశాయి. ఇందులో లగాన్, దంగల్ సినిమాలు అయితే ప్రపంచస్థాయి గుర్తింపు పొందాయి. లగాన్ అయితే ఆస్కార్‌కు కూడా నామినేట్ అయింది. ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలిసినప్పుడు కూడా తాను లగాన్ చూసినట్లు చెప్పాడు చైనా అధ్యక్షుడు. దశాబ్దం క్రితం వరకు స్థాయిలో ఉన్న బాలీవుడ్ ఇప్పుడు సక్సెస్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
భారీ సినిమాలు అట్టర్ ప్లాప్..
ఇటీవల బాలీవుడ్లో రెండు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యాయి. పెద్ద వీకెండ్ శనివారం, ఆదివారం, పంద్రాగస్టును దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలను విడుదల చేశారు. ఇందులో ఒకటి అమీర్‌ఖాన్ నటించిన లాల్‌సింగ్ చద్దా, ఇంకోటి అక్షయ్‌కుమార్ నటించిన రక్షాబంధన్. లాల్‌సింగ్ చద్దాను రూ.200 కోట్లతో, రక్షాబంధన్‌ను రూ.130 కోట్లతో తీశారు. కానీ మార్కెట్ తీవ్ర నిరాశపరిచింది. సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయం కన్నా 20 శాతం తక్కువ రావడం బాలీవుడ్ సినిమాల ప్లాప్షోను కొనసాగించాయి. భారీ బడ్జెట్ సినిమాలే అయినా.. స్టార్ హీరులో నటించినా సక్సెస్‌ను అందుకోలేదు. సాధారణంగా సినిమాకు మొదటి ఐదు రోజుల్లోనే మంచి కలెక్షన్లు, మంచి టాక్ రావాలి. కానీ ఈ రెండు సినిమాలు ఈ రెండింటిలో విఫలమయ్యాయి. లాల్‌సింగ్ చద్దాకు 5 రోజుల్లో కేవలం రూ.40 కోట్లు, రక్షాబంధన్‌కు రూ.30 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఈ రెండు సినిమాల ప్లాప్‌తో బాలీవుడ్ సినిమాల అంచనాలు మరింత పడిపోయాయి.
స్టార్ పవర్ కోసం పాకులాడడంతోనే..
సినిమా ఇండస్ట్రీ కూడా భారత ఎకానమీలో భాగమే. ఆర్థిక వేత్తలు అనేక అధ్యయనాల తర్వాత బాలీవుడ్ సినిమాల ఫెయిల్యూర్‌కు కొన్ని కారణాలు గుర్తించారు. ఇందులో ప్రధానం నిర్మాతలు స్టార్ పవర్ కోసం వెంపర్లాడడం ప్రధానమైంది. కేవలం స్టార్ హీరోలతో సినిమా తీస్తే సక్సెక్ ఎక్కువగా ఉంటుందని భావిండం. ఇందుకోసం సినిమా బడ్జెట్లో 50 శాతం హీరో, సినిమా టేకింగ్ కోసం ఖర్చు చేస్తున్నారు. 35 శాతం మార్కెటింగ్‌పై ఖర్చు చేస్తున్నారు. కేవలం 20 శాతం మాత్రమే మంచి కథ, దానిని ఆసక్తికరంగా ప్రజెంట్చేయడానికి వెచ్చిస్తున్నారు. ఈ విషయాలు బాలీవుడ్ సినిమాలను తీవ్రంగా §ð బ్బతీస్తున్నట్లు సినీ విమర్శకులు కూడా పేర్కొంటున్నారు.
దుమ్మురేపుతున్న తెలుగు సినిమాలు..
భారత దేశం కథలకు పుట్టినిల్లు. మంచి కథలను ఎన్నుకుని ఆసక్తికరంగా తీస్తే సక్సెస్ వస్తుందని సిని విమర్శకులు పేర్కొంటున్నారు. ఇందుకు తెలుగు సినిమాలను ఉదహరిస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప కథలు వాస్తవం కాదు. కల్పితాలే. అయినా ఈ కథలను తెరకెక్కించిన నిర్మాతలు సినిమా ఇండ్రస్టీలో భారీ సక్సెస్ సాధించాయి. ఇందుకు మంచి స్టోరీలైన్‌ను పట్టుకుని, తర్వాత నటులను ఎంపిక చేయడం కారణం. కానీ బాలీవుడ్లో అది జరుగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం స్టార్ పవర్‌పై ఆధారపడడం కారణంగా ప్లాప్‌షోలు ఎదుర్కొంటున్నాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా నిర్మాతలు వాస్తవాలను గుర్తించకపోతే.. ప్లాప్‌షో కంటిన్యూ కావడం తప్పదని హెచ్చరిస్తున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Bollywood flop show an industry seeking success with star heroes
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com