BJP vs TRS: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కారు నేతలు కంగారు పెడుతున్నాయి. సమావేశాలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్ఎస్ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో పెరగిన వ్యతిరేకతను ఫ్లెక్సీలతో కప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తీరు టీఆర్ఎస్ పార్టీకి లాభించకపోగా నష్టమే జరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది.
దక్షిణాదిన పట్టు కోసం..
బీజేపీ దక్షిణాదిన బలపడే ప్రయత్నంలో భాగంగా ఈసారి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు ఎక్కడైనా నిర్వహించుకునే అవకాశం ఉంది. బీజేపీ తెలంగాణలో బలపడుతోంది. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, అప్పులు, అవినీతి, కుటుంబ పాలన, అభివృద్ది రెండే మూడు నియోజకవర్గాలకే పరిమితం కావడం తదితర అంశాలు అధికార పార్టీపై ఇబ్బందిగా మారాయి. ఇవే అంశాలను తనకు అనుకూలంగా మల్చుకున్న బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుంటోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు పార్టీకి కొత్త ఉత్సాహం ఇచ్చాయి. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండు విడదలుగా చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్రం క్యాడర్లో జోష్ నింపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అదికారంలోకి వస్తుందన్న అంచనాలు పెరిగాయి. ఉత్సాహంగా ఉన్న పార్టీ క్యేడర్‌కు మరింత ఊపు తెచ్చే చర్యల్లో భాగంగా బీజేపీ అధిష్టానం జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేసింది.
Also Read: Uddhav Thackeray Resigns: మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవీస్.. ప్రజల్లోకి పాదయాత్రగా ఉద్దవ్ ఠాక్రే
అధికారంలో ఉన్నామని..
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఏడాదిగా బీజేపీతో విభేదిస్తోంది. గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏకాంగా ప్రధాని నరేంద్రమోదీపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకనొక దశలో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీ పెట్టాలని కూడా నిర్ణయించారు. ఈ క్రమంలో కమలం దండు రాష్ట్రానికి వస్తుండడంతో కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌నేతల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, హోమంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, టీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్‌గా విమర్శలు చేశారు. అవినీతి, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ క్రమంలో జాతీయ కార్యవర్గాలకు దేశవ్యాప్తంగా ఉన్న 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు హాజరు కానున్న నేపథ్యంలో తమ వైఫల్యాలు బయట పడకుండా, బీజేపీ ప్రచారానికి అవకాశం ఇవ్వకుండా చీప్‌గా టీఆర్ఎస్ ఫ్లెక్సీల పంచాయితీ మొదలు పెట్టింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి తమను కాదని రాష్ట్ర అధికారులు ఏమీ చేయరనే నమ్మకంతో హైదరాబాద్ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది.
బీజేపీకి నగరంలో స్పేస్ లేకుండా..
బీజేపీ జాతయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా స్వాగత తోరణాలు, కేంద్ర పథకాలు తెలిపే ఫ్లెక్సీలు, ప్రధాన మంత్రితోపాటు జాతీయ నాయకుల కటౌట్లో ఏర్పాటు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావించింది. అయితే బీజేపీకి స్పేష్ లేకుండా టీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న చిల్లర రాజకీయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ ఫ్లెక్ల్సీల రాజకీయాన్ని బీజేపీ నేతలు సోషల్ మీడియాతోపాటు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ చీప్ ట్రిక్స్పై చర్చ జరుగుతోంది. తాము చేసిన పని తమకే వ్యతిరేకంగా మారుతుండడంతో గులాబీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ప్రజాధనంతో సొంత పనులు..
బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీకి సమాన దూరం మాటిస్తూ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఎజెండాతో పార్టీ స్థాపించాలని టీఆర్ఎస్ అధినేత ఇటీవల నిర్ణయించారు. ఈమేరకు వివిధ రాష్ట్రాలతోపాటు ఢిల్లీవెళ్లి రిటైర్డ ఐఏఎస్‌లు, ఐïపీఎస్‌లు, ఐఆర్ఎస్లు, సీనియర్ రాజయకులతో మంతనాలు జరిపారు. బీఆర్ఎస్ స్థాపిస్తే అజెండా ఎలా ఉండాలో అభిప్రాయాలు సేకరించారు. ఇందుకోసం దాదాపు రూ.వంద కోట్ల వరకు వెచ్చించారు. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహాల కోసం మరో రూ.100 కోట్ల వరక వెచ్చించారు. జూన్ 2న దేశవ్యాప్తంగా పత్రికల్లో రాష్ట్ర ప్రగతిపై ప్రకటనలు ఇచ్చారు. ఇందుకోసం మరో రూ.200 కోట్లు ఖర్చు చేశారు. తాజాగా బీజేపీకి హైదరాబాద్‌లో స్పేస్ లేకుండా చేయడం కోసం నగరం అంతటా ఇంచు స్థలం కూడా వదల కుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఇందుకోసం రూ.500 కోట్లు వరకు ఖర్చు చేశారు. ఇప్పటికే సకాలంలో జీతాలు, ఆసరా పెన్షన్లు, పంచాయతీలకు బిల్లులు చెల్లించలేక అప్పుల కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వం కేవలం ప్రచారం కోసం కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Bjp vs trs flexi war in hyderabad flexi against prime minister modi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com