Covid 19 : కోవిడ్ సమయంలో కోట్ల విలువైన ప్యాకేజీలు అందుకున్న వారు, ఆఫీసుల్లోని సెక్యూరిటీ గార్డులు సైతం ఉద్యోగాలు కోల్పోయారు. కొంతమంది తమ కృషి ద్వారా ఈ కష్ట సమయాన్ని మంచి రోజులుగా మార్చుకున్నారు. 26 ఏళ్ల జీత్ షా, కోవిడ్ కాలాన్ని ఖాళీగా కూర్చోని వృధా చేయనటువంటి కొద్ది మందిలో ఒకరు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు స్విగ్గీలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసిన జీత్, కోవిడ్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. ప్రస్తుతం ఆయన కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా, ఆయన కోట్లాది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. జీత్ షా కోవిడ్ కష్టాలను ఎలా అధిగమించి, తనకు తానుగా విజయ మార్గాన్ని ఎలా సృష్టించుకున్నాడో.. కోట్లాది మంది యువతకు ప్రేరణగా ఎలా నిలిచాడో ఈ వార్తలో తెలుసుకుందాం.
ఇంజనీరింగ్ చదువు, ఉద్యోగం కలిసి
గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో 3 జూన్ 1999న జన్మించిన జీత్, 2021లో అహ్మదాబాద్‌లోని ఎల్ డీ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్ చదువును పూర్తి చేశాడు. చదువు ద్వారా పెద్దగా ఏమీ సాధించలేమని జీత్ కళాశాల రోజుల్లోనే గ్రహించాడు. చదువుతో పాటు అతను స్విగ్గీ, ఉబర్ ఈట్స్‌లలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు. ఉదయం తరగతులు, మధ్యాహ్నం డెలివరీ , రాత్రి కలలను నిజం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తుండేవాడు. జీత్ జీవితం ఇలాగే సాగింది.
కోవిడ్ సమయంలో కెరీర్ మలుపు
కోవిడ్ మహమ్మారి యుగం 2020 సంవత్సరంలో ప్రారంభమైంది. దేశమంతటా లాక్‌డౌన్ విధించారు. ఈ లాక్డౌన్లో లక్షలాది మంది యువతతో పాటు జీత్ కూడా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఇప్పుడు అతను పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నాడు. అతను ఈ సమయాన్ని వృధా చేసుకోలేదు. అతను డిజిటల్ మార్కెటింగ్ వైపు తిరిగి దానిని నేర్చుకున్నాడు. చాలా కష్టపడి, చాలా పరిశోధన చేసి, అతను ఈ మార్కెటింగ్ టెక్నిక్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. ఆ తర్వాత, 2021 సంవత్సరంలో అతను తన సొంత కంపెనీ “సింపెక్స్ స్కూల్ ప్రైవేట్ లిమిటెడ్” ను ప్రారంభించాడు. ఈ కంపెనీ ద్వారా జీత్ చిన్న వ్యాపారవేత్తలకు డిజిటల్ మార్కెటింగ్ నేర్పించడంలో సహాయం చేశాడు. కేవలం 18 నెలల్లోనే ఆ కంపెనీ 1 లక్ష మందికి పైగా విద్యార్థులు, వ్యాపారవేత్తలు, యువతకు డిజిటల్ మార్కెటింగ్‌లో శిక్షణ ఇచ్చింది.
సోషల్ మీడియాలో ఒక గుర్తింపు
డిజిటల్ మార్కెటింగ్‌తో పాటు అతను సోషల్ మీడియాలో కూడా తన క్రియేటివిటీని చూపించాడు. మొదట యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. ఇక్కడ కూడా విజయం సాధించారు. ప్రస్తుతం, అతను ఇన్ఫ్లుయెన్సర్‌గా పనిచేస్తున్నాడు. వ్యాపారం, వ్యక్తిగత వృద్ధి, డిజిటల్ మార్కెటింగ్‌పై చిట్కాలను ఇస్తున్నాడు. అతని యూట్యూబ్ ఛానల్ కి లక్షలాది మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. జీత్ 2021లో “కోచింగ్ కింగ్” అనే పుస్తకాన్ని కూడా రాశారు. అది బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం అతను తన కష్టార్జితం ఆధారంగా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Covid 19 covid has destroyed many people but this swiggy food delivery boy has made a millionaire
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com