TANA: ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (TANA) అమెరికాలో తెలుగువారి ఐక్యత కోసం ఏర్పాటు చేసిన సంస్థ. విద్య, ఉపాధి కోసం వెళ్లి అక్కడే స్థిరపడిన తెలుగువారు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్నారు. స్వచ్ఛంద విరాళాలతో సంస్థను నిర్వహిస్తున్నారు. పండుగలు, వేడుకలు, ఉత్సవాలు కలిసి జరుపుకుంటూ ఐక్యత చాటుతున్నారు. అమెరికాలో పుట్టిన తెలుగువారి పిల్లలకు తెలుగు, భారతీయ సంస్కృతిని అందిస్తున్నారు. వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే కొత్తగా అమెరికా వెళ్తున్నవారికి అక్కడి నియమ నిబంధనలు తెలియజేస్తూ సహాయం అందిస్తున్నారు. అలాగే సొంత రాష్ట్రాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య శిబిరాలు, వృద్ధులు, దివ్యాంగులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వమిస్తున్న తానా.. భారత్‌లో వ్యవసాయరంగంపై దృష్టిసారించింది. అన్నిరంగాలు దినదినాభివృద్ధి చెందుతుంటే.. వ్యవసాయ రంగం మాత్రమే ఎందుకు కుచించుకుపోతుందని ఆలోచించారు. ఈ క్రమంలో రైతులను ఆదుకోవడానికి, చేయూతనందించడానికి ముందుకు వచ్చారు. రైతుల కోసం తానా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అన్నదాతకు అండగా..
రైతులకు అండగా నిలిచేందుకు చేపట్టిన రైతుల కోసం తానా కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు డీవీ.చలపలిరావు స్మారకార్థం ఆయన భార్య నారేసాలెపు సునీత సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొప్పాకలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈందర్భంగా దిగుబడిని పెంచడానికి ప్రతిభావంతంగా పనిచేసేలా 10 పవర్ ప్రేయర్(Power Sprayer) లను, 10 Tarpaulins టను కొప్పాక, పెదకడిమి, రామచంద్ర పురం గ్రామాలకు చెందిన పేద రైతులకు అందించారు. కార్యక్రమం లో కొప్పాక సర్పంచ్ శ్రీ దీక్షితులు, పెదకడిమి సర్పంచ్ బలరామకృష్ణ చౌదరి,తానా సభ్యులు మేకా సతీశ్, ఎంఈవో అరుణ్, హెచ్‌ఎం శైలజ, ఎాఠశాల ఉపాధ్యాయులు గ్రామపెద్దలు పాల్గొన్నారు. సుధీర్ నారెపలుపు. సతీశ్ మెకా అధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సహకరించిన తానా కార్యదర్శి రాజా కసుకుర్తి గారికి, రైతుకొసం కమిటీ సభ్యులు రమణ అన్నె గారికి, జానయ్య కొట గారికి, అనిల్ యలమంచలి గారికి, వెంకట్ కొసరాజు గారికి, ప్రసాద్ కొల్లి గారికి, వీరలెనిన్ తాల్లురి గారికి, ప్రెమ కొమ్మరెడ్డీ గారికి, శ్రినివాస్ యలమంచి గారికి, సుధాకర్ బొడ్డూ గారికి గ్రామస్తులు అభినందనలు తెలియచెసినారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తానా కార్యవర్గాన్ని అభినందించారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Service programs under tana in koppaka of pedavegi mandal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com