Chaganti Koteswara Rao: ఏపీ ప్రభుత్వం( AP government ) కీలక ఉత్తర్వులు ఇచ్చింది. క్యాబినెట్ హోదా పొందిన వారి జీతాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. క్యాబినెట్ ర్యాంకు ఉన్నవారికి జీతాలు, ఇతర అలవెన్స్ లను ఫిక్స్ చేసింది. ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో ముగ్గురికి క్యాబినెట్ హోదా ఇచ్చింది. వారిలో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు( Chaganti Koteswarao )కూడా ఉన్నారు. ఆయనకు సైతం జీతం ఫిక్స్ చేసింది. ఇతర అలవెన్స్ లు కూడా ఆయనకు లభించనున్నాయి. రాష్ట్రంలో క్యాబినెట్ హోదా పొందిన వారికి ప్రభుత్వం నెలకు రెండు లక్షల రూపాయల జీతం అందించనుంది. వీటితోపాటు కార్యాలయ ఫర్నిచర్ ఏర్పాటుకు వన్ టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బందికి అలవెన్సులు, ఇతర సౌకర్యాల కల్పనకు మరో రెండున్నర లక్షల రూపాయలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అంటే మొత్తం నెలకు 4:30 లక్షల రూపాయలు క్యాబినెట్ హోదా వ్యక్తులకు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
* ముగ్గురు సలహాదారులకు
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు( Koteswara Rao ) పాఠశాలల్లో నైతిక విద్యా బోధన సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఈ పదవిని కట్టబెట్టారు. నేరుగా జీతం నెలకు రెండు లక్షలు కాగా.. మరో రెండున్నర లక్షలు ఇతర అలవెన్స్ ల రూపంలో అందించనుంది ప్రభుత్వం. మైనారిటీల వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా ఎంఏ షరీఫ్ ( M.A Sharif ) నియమితులయ్యారు. ఆయనకు సైతం క్యాబినెట్ హోదా కల్పించింది ప్రభుత్వం. జీతంతో పాటు అలవెన్స్ ల రూపంలో ఆయనకు నాలుగున్నర లక్షల రూపాయలు నెలకు ఇవ్వనున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్( Pendurthi Venkatesh) నియమితులయ్యారు. ఆయనకు సైతం క్యాబినెట్ హోదా ఉంది. ఇదే జీవితం ఆయనకు అందించనున్నారు అన్నమాట.
* మంత్రులందరికీ అవే సిక్స్
ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో 24 మంది మంత్రులు ఉన్నారు. సీఎం గా చంద్రబాబు( Chandrababu), డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కొనసాగుతున్నారు. 24 మంది మంత్రులకు నాలుగున్నర లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం అందించనుంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకుని ఇదివరకే ప్రకటించారు. ఆయన ప్రభుత్వం ఇచ్చిన ఫర్నిచర్ ను సైతం తిరస్కరించారు. తన క్యాంపు కార్యాలయం విషయంలో వచ్చిన విమర్శలపై కూడా అప్పట్లో పవన్ స్పందించారు. ముఖ్యంగా ప్రభుత్వంలో దుబారా ఖర్చులను తగ్గించడంలో పవన్ ముందుండేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం నేరుగా క్యాబినెట్ హోదా కలిగిన వారికి జీతభత్యాలతో పాటు అలవెన్స్ లను ప్రకటించడం విశేషం. అయితే ఈ విషయంలో పవన్ ఎలా స్పందిస్తారనేది చూడాలి.
* తగ్గిన దుబారా ఖర్చు
అయితే గతం కంటే మాత్రం ప్రజాప్రతినిధుల దుబారా ఖర్చు తగ్గింది. దీనికి కారణం డిప్యూటీ సీఎం పవన్( deputy CM Pawan) అని తెలుస్తోంది. వీలైనంతవరకు ఆర్భాటాలు తగ్గించుకుంటే ఆదర్శంగా నిలుస్తామని.. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతామని ఆయన చేసిన విన్నపాన్ని ప్రభుత్వం కూడా గౌరవించిందట. అందులో భాగంగానే రహదారులపై సభలు సమావేశాలు వద్దని ముందుగానే తీర్మానించారు. సభలకు జన తరలింపు కూడా వద్దని అప్పట్లో పవన్ సూచించారట. మొత్తానికి అయితే క్యాబినెట్ హోదా ఉన్న వారి విషయంలో జీతభత్యాలు, ఇతరత్రా అలవెన్స్ ల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది.