Bheemla Nayak First Day US Collections!
Bheemla Nayak First Day US Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – నేషనల్ యాక్టర్ రానా క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ పై భారీ హైప్ క్రియేట్ అయింది. అందుకే ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా యూఎస్ లో ఒకరోజు ముందుగానే విడుదల చేశారు. ఈ సినిమాకు అక్కడ కలెక్షన్స్ భారీ స్థాయిలో వచ్చాయి. సినిమా మొదటి రోజు అల్టిమేట్ కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించాడు ‘భీమ్లా నాయక్’.
Bheemla Nayak First Day US Collections!
అలాగే యూఎస్ లో బెనిఫిట్ షోలతో చాలా సెంటర్స్ లో రెట్టింపు బుకింగ్స్ తో కొత్త రికార్డ్స్ ను సెట్ చేసింది ఈ చిత్రం. ఇక యూఎస్ లో మొదటి రోజు కలెక్షన్స్ లెక్కల విషయానికి వస్తే.. ఓవర్సీస్లో అద్భుతమైన స్పందనతో మొదటి రోజు ఈ సినిమా $1100K కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది.
భీమ్లా నాయక్ కి ఇప్పుడున్న ఊపు చూస్తుంటే.. చాలా ఈజీగా 2 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా తన ప్రభంజనాన్ని ఘనంగా చూపించాడు. యూఎస్ లోనూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిస్తుంది అనడానికి పై కలెక్షన్లే నిదర్శనం. పైగా ఈ మధ్య కాలంలో ఒక తెలుగు సినిమాకి ఈ తరహా కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి.
Bheemla Nayak First Day US Collections!
Also Read: Bheemla Nayak Pre Release Event: ‘భీమ్లా నాయక్’ కోసం ముందు జాగ్రత్తలు
వచ్చే వీకెండ్ లో కూడా ఈ చిత్రం ఇదే జోరు కొనసాగించేలా ఉంది. మొత్తానికి పవన్ ‘నాయక్’ అంటూ బాక్సాఫీస్ పై దండయాత్ర మొదలుపెట్టాడు. ‘భీమ్లా నాయక్‘ చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ జాతర చేస్తున్నారు. ఎక్కడ చూసినా ‘భీమ్లా నాయక్’ థియేటర్స్ వద్ద కోలాహలం కనిపిస్తుంది.
మొదటి షో నుండే ‘భీమ్లా నాయక్’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. అందుకే ‘భీమ్లా నాయక్’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద తిరుగులేకుండా పోయింది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా యూఎస్ లో సైతం రికార్డ్ స్థాయి వసూళ్లను సాధించడం గ్రేట్.