Unstoppable Balayya
Unstoppable: ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవలే ఆయన నటించిన అఖండ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్‌స్టాపబుల్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ షో ఫస్ట్ ఎపసోడ్కు మంచు మోహన్ బాబు రాగా.. ఆ తర్వాత నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపుడిలతో రెండు, మూడు ఎపిసోడ్లను నిర్వహించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆతర్వాత నాలుగో ఎపిసోడ్‌కు అఖండ టీమ్‌ను దింపి నూతనోత్సాహాన్ని నింపారు. ఎక్కడా ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా బాలయ్య ఫుల్ జోష్ నింపారు.
Unstoppable Balayya
The men behind the biggest Indian movie are on the biggest talk show. 🤩#UnstoppableWithNBK Episode 5
is going to be a treat with @ssrajamouli garu and @mmkeeravani garu having a great time with our #NandamuriBalakrishna garu.Promo out soon. pic.twitter.com/Qdi62NCVvP
— ahavideoin (@ahavideoIN) December 15, 2021
తాజాగా, ఈషో తర్వాత ఎపిసోడ్లో దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి పాల్గొననున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రొమోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ఆహా తెలిపింది.
Also Read: ఏపీ టికెట్ ధరల విషయంలో తగ్గేదేలే అంటున్న బాలయ్య..
కాగా, ఇటీవలే బాలయ్య చేతికి గాయం కావడంతో కొద్దిరోజులు షో వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకోవడంతో.. మళ్లీ బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ రాజమౌళి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య ఒక ఆటమ్బాంబులాంటి వాడని పొగిడారు రాజమౌళి.
కాగా, రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెల్లేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు జక్కన్న.. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కూడా మొదలెట్టేశారు. ఇప్పటికే పలు చోట్ల ఇంటర్వ్యూలు ఇవ్వగా.. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు విడుదలైన ట్రైలర్ కూడా అన్ని భాషల్లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్లిపోతోంది.
Also Read: మంచి కథతో వస్తే మల్టీస్టారర్‌కు రెడీ అంటున్న బాలయ్య
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Balayya unstoppable next guest is rajamouli and kiravani
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com