Horoscope – Rashiphalalu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి 8 సోమవారం ద్వాదశ రాశులపై జేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది.మరికొన్ని రాశుల వారికి అదృష్టం రానుంది. అలాగే ఈరోజు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
ఈ రాశివారికి ఆర్థికంగా లోటు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు రావొచ్చు. వ్యాపారులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వృషభం:
ఆర్థికపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. ఏదైనా పని రిస్క్ అనుకుంటే దానిని వదిలేయడమే మంచిది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
మిథునం:
పెండింగులో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
కర్కాటకం:
కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులకు నష్టం రావొచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
సింహ:
సామాజిక జీవితం మెరుగ్గా ఉంటుంది. ఎవరితోనైనా వాగ్వాదాలు ఎక్కువగా చేయకుండా ఉండడమే మంచిది. వ్యాపారులు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
కన్య:
బంధువులతో విభేదాలు రావొచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఏర్పడవచ్చు. వైవాహిక జీవితంలో సమ్యలు ఎదురవుతాయి.
తుల:
వ్యాపారులకు ఆకస్మిక లాభాలు రావొచ్చు. ఖర్చుల పెరిగే అవకాశం. విదేశీ వ్యాపారులకు నష్టం ఏర్పడే ఛాన్స్. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు ఉండాలి.
వృశ్చికం:
మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారులు చేసే పనుల్లో నిజాయితీ ఉండాలి. మానసిక స్థితి మారుతూ ఉంటుంది. ఆర్థిక విషయంలో పెద్దగా ఆందోళన చేయాల్సిన అవసరం లేదు.
ధనస్సు:
వ్యాపారులకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు వారి విధుల్లో ఆటంకాలు ఏర్పడుతాయి. కొంతకాలం పాటు శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మకర:
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. సాయంత్రం బహుమతులు పొందే అవకాశం. శత్రువులు మీపై ఎక్కువగా ఫోకస్ చేస్తారు.
కుంభం:
పెండింగులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ముఖ్యమైన విషయాల గురించి ఆందోళన చెందుతారు.
మీనం:
ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నాలనైనా విరమించుకోవద్దు. అయితే ఏ పనిచేసినా నిరాశగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.