Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితం అతని బట్టి ఉంటుందని పండితులు చెబుతారు. అందుకే ఏదైనా కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఆ వ్యక్తి జాతకాన్ని.. రాశిని చూస్తుంటారు. అయితే కొన్ని రాశుల వారు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. వీరిలో ఆరు రాశుల వారు ఎప్పుడు అబద్ధం ఆడకుండా నిజాలే చెబుతూ ఉంటారు. ఒకవేళ వారు అబద్ధం చెప్పినా వెంటనే దొరికిపోతారు. అయితే వీరి నిజాయితీతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. సమాజంలో వీరికి గౌరవం కూడా ఉంటుంది. మరి ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి వారు ధైర్యంగా ఉండగలుగుతారు. ఏ పని అయినా వెంటనే పూర్తి చేయగలుగుతారు. ఇదే సమయంలో వీరు ఎప్పటికీ నిజాలే చెబుతూ ఉంటారు. ఒకవేళ ఏదైనా వివాదం ఏర్పడితే వెంటనే దానిని పరిష్కరించుకోవడానికి ఆలోచిస్తారు. కొన్ని వివాదాల్లో మేష రాశి వారు మధ్యవర్తిగా ఉండి పరిష్కరిస్తారు. మనసులో ఏ ఆలోచన ఉన్న వెంటనే వారు బయటకు చెప్తారు. వీరి తో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఎ లాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు.
సింహ రాశి వారు ఎదుటివారిని ఆకట్టుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. వీరి రాశిలో సూర్యుడి పాత్ర ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ విషయాన్ని అయినా దాచుకోకుండా వెంటనే బయటకు చెప్తారు. అయితే ఏదైనా విషయం నేరుగా చెప్పకుండా వివిధ పద్ధతుల ద్వారా తమ భావాలను వ్యక్తపరుస్తారు.వీరు ఎవరితో మాట్లాడితే వారు ఉల్లాసంగా ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే దానిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.
కన్యా రాశి వారు ఎప్పుడూ ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరు ఒక పనిని సమగ్రంగా పూర్తి చేయడానికి ఇష్టపడతారు. వీరి ప్రవర్తన ఎదుటివారికి ఇష్టంగా ఉంటుంది. మీరు ఇచ్చే సలహాలు ఎదుటివారికి ఉపయోగపడతాయి. మర్యాదపూర్వకమైన ప్రవర్తన ఉంటుంది. ఇటువంటి విమర్శలు చేసినా ఆకట్టుకుంటారు. వీరికి కొంతమంది నమ్మకం దారులు ఉంటారు.
ధనస్సు రాశి వారు ఎప్పుడూ బిగ్గర్ గా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి వీరికి కోపం వచ్చిన కూడా.. వారు చెప్పే మాటలు నిజాయితీ ఉంటుంది. ఎదుటివారికి నిజమైన సలహాదారులుగా ఉంటారు. ఎప్పుడూ సాహసం కోరుకునే వీరు ఒక పనిని నిజాయితీగా పూర్తి చేస్తారు. ప్రపంచాన్ని అన్వేషించేటప్పుడు సత్యం మాత్రమే ఉండాలని అనుకుంటారు. వీరి మాటలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి.
మకర రాశి వారు ఎలాంటి విషయం చెప్పినా నమ్మవచ్చు. వీరికి శని గ్రహం ఎప్పటికీ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల నిజాయితీతో పనులు చేస్తారు. ఒక గ్రూపులో లీడర్ గా ఉంటే ఆ గ్రూపు మొత్తానికి మంచి పేరు వస్తుంది. వ్యాపారస్తులుగా ఉన్నట్లయితే మంచి లాభాలను పొందుతారు. ఎప్పుడూ తప్పుడు పనులు చేయకుండా.. సత్యమే మాట్లాడుతారు. మీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే విజయం సాధిస్తారు.
కుంభ రాశి వారు సత్యం మాట్లాడడానికి మాత్రమే ఇష్టపడతారు. వీరికి సమాజంలో గౌరవం ఉంటుంది. కొత్త ఆలోచనలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. స్వతంత్ర ఆలోచనలు కలిగి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులుగా రాణిస్తారు. ఉద్యోగం చేసినట్లయితే ఆ సంస్థకు లాభం చేకూరే అవకాశం ఉంటుంది.