Goddess Durga blessings zodiac: సెప్టెంబర్ 22 నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనం ఎవరున్నారు. ఈ సందర్భంగా దేశంలోని వాడవాడలా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు రానున్నాయి. దుర్గామాత అనుగ్రహంతో వీరు అనుకున్న పనులను సాధిస్తారు.
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మేషరాశి జీవితంలో కీలక మలుపులు జరగాలున్నాయి. వీరికి అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
సింహరాశి వారి జాతకం సెప్టెంబర్ 22 నుంచి మారనుంది. వీరికి అనుకొని అదృష్టం వరించనుంది. వ్యాపారులకు అధిక ప్రయోజనాలు ఉండనున్నాయి. కొత్తగా వ్యాపారం చేయాలని అనుకునే వారికి ఇదే మనిషి సమయం. నవరాత్రుల సమయంలో వీరు అమ్మవారిని సేవించడం వల్ల కనక వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఎలాంటి వివాదాలు ఉన్న సమస్య పోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దీంతో ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. విహార యాత్రలకు వెళ్తారు. బంధువుల నుంచి ధన సహాయం పొందుతారు.
ధనస్సు రాశి వారు దుర్గాదేవి కటాక్షాన్ని పొందనున్నారు. వ్యాపార పరంగా వీరు అనేక లాభాలు పొందనున్నారు. అదనపు ఆదాయం పొందడానికి మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. ఒత్తిడి నుంచి బయటపడతారు. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు లాభాలు పొందుతారు. ఆన్లైన్ పెట్టుబడుల ద్వారా ఊహించిన దానికంటే ఎక్కువ లాభం వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపార పర్యటనలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అదృష్టం కలగడంతో ఇల్లు సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల మద్దతుతో ఉద్యోగులు సంతోషంగా ఉంటారు.