Guntur Kaaram Trailer Review : త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా ఈ సంక్రాంతికి మనం ముందుకు రాబోతున్న సినిమా గుంటూరు కారం ఇక ఇప్పుడు ఈ సినిమా మీదనే చాలా రోజుల నుంచి హైప్ నెలకొంది. ఇండస్ట్రీలో, ఫ్యాన్స్ లో చాలా అంచనాలు ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలో కొద్దిసేపటి క్రితమే గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది.అయితే ఈ సినిమా ఎలా ఉందనేది ఈ ట్రైలర్ చూస్తే క్లారిటీ వస్తోంది..
అయితే ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీగా మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. త్రివిక్రమ్ గత సినిమాలను చూసుకుంటే కూడా అవన్నీ కూడా ఒక ఫ్యామిలీ చుట్టూ తిరిగే ఒక కథ ని తీసుకొని ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాని కూడా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించినట్టు గా తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ ని ఆద్యంతం ప్రేక్షకుడిని కట్టిపడేసే డైలాగులతో నడిపించినప్పటికీ ట్రైలర్ చూస్తుంటే మాత్రం సినిమాలో పెద్దగా కంటెంట్ వర్కౌట్ అయినట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే ఈ సినిమాలో కూడా త్రివిక్రమ్ గత చిత్రపు ఛాయాలు అయితే కనిపిస్తున్నాయి.ఇక రమ్యకృష్ణ.. మహేష్ బాబుల మధ్య మదర్ అండ్ సన్ కోర్ ఎమోషన్ తో ఈ సినిమా ప్లాట్ నడుస్తుంది అనేది తెలుస్తుంది.
అయితే రమ్యకృష్ణ .. మహేష్ బాబు ఇద్దరి మధ్య వచ్చే సీన్ లను హైలెట్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించినట్టు గా కూడా తెలుస్తోంది. అయితే మహేష్ బాబు చెప్పిన డైలాగులు కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ అవి మాత్రం త్రివిక్రమ్ స్టాండర్డ్ డైలాగ్స్ అయితే కాదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక మహేష్ బాబు కూడా ఇంతకుముందు చేసిన దూకుడు,పోకిరి టైప్ ఆఫ్ డైలాగ్ డెలివరీ యాక్షన్ నే మళ్లీ రిపీట్ చేసినట్టుగా అనిపిస్తుంది. నిజానికి కమర్షియల్ సినిమాలు చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ దాన్ని పర్ఫెక్ట్ గా చేయకపోతే పెంట పెంట అవుతుందనేది మనం ఇంతకు ముందు వచ్చిన చాలా సినిమాలను చూశాం…
అందులో ఒక టాప్ హీరోతో కమర్షియల్ సినిమా చేయాలన్నది కత్తి మీద సాము లాంటిది.. ఏమాత్రం కొంచెం అటు ఇటు అయిన కూడా మొదటికే మోసం వచ్చేస్తుంది. ఇక ఇలాంటి సమయం లో ఇప్పుడు రిలీజ్ అయిన ఈ ట్రైలర్ మాత్రం జనాన్ని పెద్దగా ఆకట్టుకోలేదు.. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి…ఇక ట్రైలర్ లో ఈ సినిమాలో ఉండే ఆర్టిస్టులందరిని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ వాళ్లని ఏ విధంగా వాడుకున్నాడు వాళ్ళు సినిమాకి ఎంతవరకు ప్లస్ అయ్యారు అనే విషయం లో సినిమా చూస్తే గాని ఒక క్లారిటీ అయితే రాదు…