Horoscope : ఈరోజు రాశిఫలాలు
మేషరాశి:
వ్యాపారం చేసేవారు ఎదుటి వారి ఆలోచనలను పంచుకోండి. అయితే అనవసర విషయాల్లో పరిధి దాటి తలదూర్చవద్దు. శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉండే అవకాశం.
వృషభం:
తెలివితో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. బంధువులు, స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. మొదలుపెట్టిన కార్యాలను పూర్తి చేస్తారు.
మిథునం:
ఉద్యోగం,వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు.కొన్ని విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం. అయినా మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి. దైవారాధన తప్పకుండా చేయాలి.
కర్కాటకం:
అనవసర విషయాలతో సమయం వృథా చేయొద్దు. కొన్ని పనుల్లో శ్రమ పెరిగినా విజయవంతంగ పూర్తి చేస్తారు. శివారాధన వీరికి అనుకూలంగా ఉంటుంది.
సింహం:
చిన్న అంశాలను అక్కడితోనే పూర్తి చేయాలి. కొందరు దగ్గరి వారే చెడగొట్టాలని చూస్తారు. వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవి పూజ చేయడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి.
కన్య:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు.
తుల:
ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఈరోజు అనందంగా ఉంటారు.
వృశ్చికం:
కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టిన పనుల్లో కాలంతో పాటు వెళ్లాలి.
ధనస్సు:
ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యం కోల్పోకూడదు. ఒక వార్త మనస్థాపానికి గురి చేస్తుంది. ఆరోగ్యంపై పట్ల శ్రద్ధ వహించాలి. శివుడిని పూజ చేయడం వల్ల వీరికి అనుకూల ఫలితాలు ఉంటాయి.
మకరం:
బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల నుంచి సహకారం ఉంటుంది. మానసికంగా ధ్రుఢంగా ఉండగలుగుతారు.
కుంభం:
గతంలో మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్థిరాస్తికొనుగోలు చేయడానికి ముందకువెళ్తారు.
మీనం:
కొన్ని రంగాల వారికి శ్రమ పెరిగినా మనశ్శాంతి ఉంటుంది. బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.