Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు. మన గేమ్ ఆధారంగానే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ క్రమంలో టాప్ సెలెబ్స్ లో ఒకరు ఇంటిని వీడటం ఖాయం అంటున్నారు. 14 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 7 మొదలైంది. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని వరుసగా ఎలిమినేట్ అయ్యారు. 4వ వారం ఊహించని ఎలిమినేషన్ చోటు చేసుకుంది. ఫైనల్ లో ఉంటుందనుకున్న రతికా రోజ్ ఇంటి బాట పట్టింది. ఆమె గేమ్ పూర్తిగా విమర్శల పాలైంది. దీంతో ఆడియన్స్ ఓట్లు వేయలేదు.
ఇక ఐదవ వారానికి 7గురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. పవర్ అస్త్ర గెలుచుకున్న సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ నామినేషన్ నుండి మినహాయింపు పొందారు. శోభా శెట్టి నిర్ణయంతో పవర్ అస్త్ర కోల్పోయిన శివాజీ నామినేషన్స్ లోకి వచ్చాడు. టాస్క్ లో గౌతమ్ ని కొట్టిన తేజాను హోస్ట్ నాగార్జున నేరుగా నామినేట్ చేశాడు. శివాజీ, తేజాతో పాటు అమర్ దీప్, ప్రిన్స్ యావర్, ప్రియాంక, గౌతమ్, శుభశ్రీ నామినేట్ కావడమైంది.
మొదటి నుండి ఓటింగ్ లో శివాజీ దూసుకుపోతున్నాడు. అతడు అత్యధిక ఓట్లతో టాప్ లో ఉన్నాడట. తర్వాత స్థానాల్లో గౌతమ్, యావర్, టేస్టీ తేజా ఉన్నారట. అందరి కంటే చివర్లో ఉన్న తేజా పుంజుకున్నట్లు సమాచారం. అతడు ప్రియాంక, అమర్ దీప్ లను వెనక్కి నెట్టి ఐదో స్థానంలోకి వెళ్ళాడట. ఇక చివరి రెండు స్థానాల్లో అమర్ దీప్, ప్రియాంక ఉన్నారట. సీరియల్ బ్యాచ్ గా పేరు తెచ్చుకున్న అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి కలిసి ఆడుతున్నారనే అపవాదు ఉంది.
సోషల్ మీడియాలో కూడా వీరి గేమ్ పై అసంతృప్తితో కూడిన కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో టాప్ సెలెబ్స్ అయిన అమర్ దీప్, ప్రియాంకలకు ఆడియన్స్ తక్కువగా ఓట్లు వేశారట. అమర్ దీప్ కంటే ప్రియాంకకు తక్కువ ఓట్లు వచ్చిన నేపథ్యంలో ప్రియాంక ఎలిమినేషన్ ఖాయం అంటున్నారు. మరి అదే జరిగితే సంచలనమే. వరుసగా ఐదో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు అవుతుంది. మరి చూడాలి ఈ ఉహాగానాల్లో ఎంత వరకు నిజం ఉందో…