ఏపీ గవర్నర్ ను కలిసిన ఎస్ఈసీ

స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని, ఇందులో భాగంగా బుధవారం కలెక్టర్ల సమావేశం కోసం ప్రభుత్వ సీఎస్ ను ఎన్నికల కమిషనర్ అనుమతి కోరిన విషయం తెలిసిందే. దీంతో సీఎస్ సాహ్ని ప్రస్తుతం ఎన్నికలు అవసరం లేదని, కలెక్టర్లతో సమావేశానికి అనుమతి ఇవ్వమని సీఎస్ తేల్చారు. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ బుధవారం రాష్ట్ర గవర్నర్ శిశ్వభూషణ్ హరిచందన్ […]

Written By: Suresh, Updated On : November 18, 2020 12:13 pm
Follow us on

స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని, ఇందులో భాగంగా బుధవారం కలెక్టర్ల సమావేశం కోసం ప్రభుత్వ సీఎస్ ను ఎన్నికల కమిషనర్ అనుమతి కోరిన విషయం తెలిసిందే. దీంతో సీఎస్ సాహ్ని ప్రస్తుతం ఎన్నికలు అవసరం లేదని, కలెక్టర్లతో సమావేశానికి అనుమతి ఇవ్వమని సీఎస్ తేల్చారు. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ బుధవారం రాష్ట్ర గవర్నర్ శిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత, ఎన్నికలపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై గవర్నర్ తో చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ తో భేటీ తరువాత ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.