https://oktelugu.com/

ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ

హైదరాబాద్ లో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. గ్రేటర్ పరిధిలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగిస్తున్నారు. తమకు టికెట్ వస్తుందనుకుంటున్న ఆశావహులు నామినేషన్లు వేసేందుకు వెళ్తున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ తొలిజాబితా ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. అటు బీజేపీ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 18, 2020 / 12:21 PM IST
    Follow us on

    హైదరాబాద్ లో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. గ్రేటర్ పరిధిలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగిస్తున్నారు. తమకు టికెట్ వస్తుందనుకుంటున్న ఆశావహులు నామినేషన్లు వేసేందుకు వెళ్తున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ తొలిజాబితా ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. అటు బీజేపీ 50 మందితో కూడి జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.