https://oktelugu.com/

నయన్ బర్త్ డే.. లేడి సూపర్ స్టార్ గా ఎలా ఎదిగిందంటే?

దక్షిణాదిలో అగ్ర కథానాయికగా నయనతార కొనసాగుతోంది. సౌత్ క్వీన్ గా… లేడి అమితాబ్ గా నయనతార గుర్తింపు తెచ్చుకుంది. నయనతార కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనపరంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. కుర్రకారులో నయనతారకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నేడు నయనతార 35వ పుట్టిన సందర్భంగా అభిమానులు ఆమెకు బర్తేడ్ విషెస్ చెబుతూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. Also Read: బిగ్ బాస్-4: రీ ఎంట్రీకి సిద్ధమైన కంటెస్టంట్ ఎవరంటే? నయనతార దక్షిణాదిలోని అన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2020 / 12:05 PM IST
    Follow us on

    దక్షిణాదిలో అగ్ర కథానాయికగా నయనతార కొనసాగుతోంది. సౌత్ క్వీన్ గా… లేడి అమితాబ్ గా నయనతార గుర్తింపు తెచ్చుకుంది. నయనతార కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనపరంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. కుర్రకారులో నయనతారకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నేడు నయనతార 35వ పుట్టిన సందర్భంగా అభిమానులు ఆమెకు బర్తేడ్ విషెస్ చెబుతూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు.

    Also Read: బిగ్ బాస్-4: రీ ఎంట్రీకి సిద్ధమైన కంటెస్టంట్ ఎవరంటే?

    నయనతార దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించి అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. తెలుగు.. తమిళం.. తెలుగు.. కన్నడం.. మలయాళ భాషల్లో నటించి సౌత్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ఆరంభం నుంచే నయన్ సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. వరుసగా ఇండస్ట్రీలోని టాప్ హీరోలతో నటించి స్టార్డమ్ తెచ్చుకుంది. దక్షిణాదిలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు నయన్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.

    నయనతార దాదాపు పదిహేడేళ్లుగా సినీ రంగంలో కొనసాగుతోంది. సీనియర్, జూనియర్ హీరోలందరికీ నయనతారే బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూ మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యమిస్తూ సౌత్ ఇండస్ట్రీలో దూసుకెళుతోంది. నయనతార తెలుగులో ‘లక్ష్మీ’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్టవడంతో ఆమెకు తెలుగులోనూ వరుస అవకాశాలు దక్కాయి.

    Also Read: ఆ హీరో భార్యకు తాప్సీ నచ్చలేదంట.. ఆ తర్వాత ఏమైంది?

    బాలకృష్ణ.. నాగార్జున.. వెంకటేష్.. చిరంజీవి.. ప్రభాస్ తదితర హీరోల సరసన నటించింది. ఈక్రమంలో తెలుగులో అత్యధిక రెమ్యూనరేష్ తీసుకొనే హీరోయిన్ గా నయనతార రికార్డు సృష్టించింది. బాపూ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరామరాజ్యం’లో నయనతార సీతగా నటించి విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతోపాటు ఉత్తమ నటిగా నంది అవార్డు దక్కించుకుంది.

    సినిమాల్లో ఆమె కెరీర్ దూసుకుపోతున్నప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఇబ్బందులు పడుతోంది. నిత్యం ప్రేమాయణం.. బ్రేకప్.. పెళ్లి విషయాలతో నయనతార వార్తల్లో నిలుస్తోంది. నయన్ ప్రస్తుతం దర్శకుడు విఘ్నష్ తో ప్రేమాయణం సాగిస్తుంది. ఈ ప్రేమాయణం అయిన పెళ్లి వరకు వెళుతుందా? లేదా అనేది మాత్రం వేచిచూడాలి. పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ ప్రభావన్నితన సినిమాలపై పడకుండా చూసుకుంటూ అందరి కంటే స్పెషల్ అనిపించుకుంటోంది నయనతార.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్