https://oktelugu.com/

వైరల్ అవుతోన్న పవన్ ఫ్యామిలీ ఫోటో !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒళ్లో ఆయన కూతురు ఆధ్య‌, కొడుకు అకిరా నంద‌న్ ఇలా పిల్లలిద్దరూ తల వాల్చి పడుకున్నారు. ఈ అపురూపమైన ఫోటోను తానే తీశానని రేణూ దేశాయ్ చెబుతూ ఈ అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. సినిమాలు, పాలిటిక్స్ తో బిజీబిజీగా ఉండే ప‌వ‌న్ క‌ల్యాణ్ టైం దొరికితే ఫ్యామిలీతో సరదాగా గ‌డిపేందుకు ఇష్ట‌ప‌డుతుంటానని ఆ మధ్య పవనే స్వయంగా ఓ […]

Written By:
  • admin
  • , Updated On : December 2, 2020 / 04:25 PM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒళ్లో ఆయన కూతురు ఆధ్య‌, కొడుకు అకిరా నంద‌న్ ఇలా పిల్లలిద్దరూ తల వాల్చి పడుకున్నారు. ఈ అపురూపమైన ఫోటోను తానే తీశానని రేణూ దేశాయ్ చెబుతూ ఈ అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. సినిమాలు, పాలిటిక్స్ తో బిజీబిజీగా ఉండే ప‌వ‌న్ క‌ల్యాణ్ టైం దొరికితే ఫ్యామిలీతో సరదాగా గ‌డిపేందుకు ఇష్ట‌ప‌డుతుంటానని ఆ మధ్య పవనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

    Also Read: ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ కే 22 కోట్లు !

    మొత్తానికి ఈ ఫొటో పవన్ మాటలకు నిద‌ర్శ‌నంగా నిలిచింది. పైగా ఈ ఫోటో వల్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఆధ్య‌, అకిరా నంద‌న్ ఎంత స‌ర‌దాగా ఉంటారో అర్ధమవుతుంది. ఇక రేణూదేశాయ్ ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వెంటనే ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా రేణూ.. ‘నా ఫోన్ కెమెరాతో తీసిన అరుదైన క్ష‌ణాల‌కు సంబంధించిన ఫోటో. వారు మీ ఫోన్ ఫొటో ఆల్బ‌మ్ లో ఉండని అంద‌మైన స్టిల్స్ ను మీతో పంచుకుంటున్నా.. అని రేణూ దేశాయ్ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. పవన్ ఫ్యాన్స్ కు ఈ ఫోటో మంచి కిక్ ను ఇచ్చింది.

    Also Read: పవన్ కళ్యాణ్ పై భక్తుడు ఎమోషనల్ ట్వీట్స్ !

    అయితే రేణూ ఈ ఫొటోకు కామెంట్ సెక్ష‌న్ ను కనిపించ‌కుండా (డిసేబుల్‌) చేయడంతో అభిమానులకు తమ స్పందనను బలంగా తెలపడానికి పెద్దగా అవకాశం లేకుండా పోయింది. ఇక ఆద్య పేరుతో తెర‌కెక్క‌నున్న పాన్ ఇండియా సినిమాతో రేణూ దేశాయ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. అలాగే రేణూ ఓ సినిమాకి డైరెక్షన్ కూడా చేస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్