పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర సీఎం జగన్ సందర్శించనున్నారు. ఈనెల 14న ఆయన తాడెపల్లి గూడెం నుంచి ఉదయం 10 గంటలకు హెలీక్యాప్టర్ లో పోలవరానికి వెళ్తారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు అధికారులతో సమీక్ష చేస్తారు. అనంతరం తిరిగి తాడేపల్లి గూడెంకు చేరుకుంటారు. కాగా ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం జాతీయ జలవనరుల శాఖ నిధులు విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు రూ.2,234 కోట్లను బదిలీ చేసింది. రాష్ట్రప్రభుత్వం చేసిన ఖర్చులను రీయంబర్స్ చేస్తూ ఈ నిధులను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.17,665 కోట్లు పోలవరం కోసం ఖర్చు చేయగా రూ. 10,741 కోట్లు రీయంబర్స్ చేసింది