https://oktelugu.com/

ఆ మంత్రి ఇలాఖాలో ఇష్టారాజ్యమా?!

ప్రత్యర్థి ఇంటిపై దాడి.. పరామర్శకు వచ్చిన వాళ్లపై రాళ్ళదాడి.. ఎన్నికళ వేళ భయానక వాతావరణం.. నిరసన తెలిపిన వారికే సంకెళ్లు.. చదువుతుంటే ఏదో సినిమా సీన్ల మాదిరిగా ఉన్నట్టుంది కదూ..! కానీ.. ఇవి సినిమా ఘటనలు కాదు.. సీమ సంఘటనలు! చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో తరచూ ఇదే పరిస్థితి నెలకొంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. Also Read: చంద్రబాబు చేయని పని.. జగన్ కు పోల‘వర’మవుతుందా? దాడులు.. ప్రతిపక్ష పార్టీల నేతలపై […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 12, 2020 / 10:44 AM IST
    Follow us on


    ప్రత్యర్థి ఇంటిపై దాడి.. పరామర్శకు వచ్చిన వాళ్లపై రాళ్ళదాడి.. ఎన్నికళ వేళ భయానక వాతావరణం.. నిరసన తెలిపిన వారికే సంకెళ్లు.. చదువుతుంటే ఏదో సినిమా సీన్ల మాదిరిగా ఉన్నట్టుంది కదూ..! కానీ.. ఇవి సినిమా ఘటనలు కాదు.. సీమ సంఘటనలు! చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో తరచూ ఇదే పరిస్థితి నెలకొంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

    Also Read: చంద్రబాబు చేయని పని.. జగన్ కు పోల‘వర’మవుతుందా?

    దాడులు..
    ప్రతిపక్ష పార్టీల నేతలపై మంత్రి అనుచరులు చేస్తున్న దాడుల పరంపర కొనసాగుతోందని, ఉద్దేశపూర్వకంగానే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ప్రత్యర్థులు అంటున్నారు. చనిపోయిన తమ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై శుక్రవారం తంబళ్లపల్లిలో దాడి జరిగింది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు తంబళ్ళపల్లెకు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సుమారు వంద మంది మాటువేసి రాళ్ల దాడి చేశారని బాధితులు ఆరోపించారు. నిందితులను అరెస్టు చేయాలని టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. అయితే.. పోలీసులు రాళ్లు వేసిన వారిని పట్టుకోకుండా.. ధర్నా చేస్తున్న తమని అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటన పై చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించారు. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పోలీస్ స్టేషన్లను పెద్దిరెడ్డి కుటుంబానికి అప్పచెప్పారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.

    Also Read: ఏపీ కేబినెట్లోకి ఈసారి వారికే ఛాన్స్..?

    సమాంతర పాలన సాగిస్తున్నారు..
    మంత్రి పెద్దిరెడ్డికి పట్టున్న ప్రాంతాల్లో సమాంతర పాలన కొనసాగుతోందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనికి గతంలో జరిగిన ఘటనలను ఆధారంగా చూపుతున్నారు. ఇటీవల జనసేన పార్టీకి చెందిన ఓ మహిళా నేత ఇంటిపై దాడి జరిగింది. ఆ తర్వాత.. పెద్దిరెడ్డిపై పోస్టు పెట్టారన్న కారణంగా సోషల్ మీడియా కార్యకర్తల్నీ వదిలి పెట్టడం లేదు. గతంలో ఎన్నికల సమయంలో ఆ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ విధంగా.. వైసీపీలోని అరాచక, అసాంఘిక శక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కడపలో కూడా లేనటువంటి ఉద్రిక్త పరిస్థితులు.. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గాల్లో ఏర్పడుతున్నాయని అంటున్నారు. ఆయన అనుచరులు దాడులు చేసినా.. అక్కడి పోలీసులు సైలెంట్ గా ఉంటున్నారని విమర్శిస్తున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్