YSRCP Movie Dialogues: పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) స్వతహాగా సినిమా స్టార్. తెలుగు అగ్ర కథానాయకుడిగా కొనసాగుతుండగా రాజకీయాల్లోకి వచ్చారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. అయితే తనకు సినిమా రంగం కంటే రాజకీయాలు అంటేనే ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని కూడా ప్రకటించుకున్నారు. అయితే తాజాగా ఆయన సినిమా డైలాగులపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్సీపి శ్రేణులు సినిమా డైలాగులు చెబుతూ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే చేసి చూపిస్తామంటూ సినిమా డైలాగులు చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు వాటిని గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: టీడీపీని తక్కువ చేసి మాట్లాడలేదు.. పవన్ హాట్ కామెంట్స్
ప్రకాశం జిల్లాలో వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ వద్ద కీలక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అందులో భాగంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించిన శాఖలు నిర్వర్తిస్తుండడం.. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు సైతం సమకూర్చుతున్నారు. అలా పవన్ చొరవతో ప్రకాశం జిల్లాకు( Prakasam district) జలజీవన్ మిషన్ నిధులు వచ్చాయి. ఆ నిధులతో చేపడుతున్న పనులను ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తీరును ఎండగట్టారు. నాకు నచ్చనివి సినిమా డైలాగులు అంటూ చెప్పుకొచ్చారు. మీరు సినిమాల మాదిరిగా నరుకుతాం.. కొరుకుతాం అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీరు నరుకుతామంటే మేము కూర్చొని ఉండిపోతామా అంటూ సెటైర్లు వేశారు. గట్టి హెచ్చరికలే పంపారు.
Also Read: కొడుకులతో పవన్ కళ్యాణ్.. అకిరా నందన్ డామినేషన్ మాములుగా లేదుగా..లేటెస్ట్ ఫోటో వైరల్!
జగన్ కు గట్టి కౌంటర్
ఇటీవల జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )నోట పుష్ప డైలాగ్ వినిపించిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే రఫా రఫా అంటూ కత్తితో కోసుకుని ముందుకు సాగుతామని ఓ కార్యకర్త జగన్ పర్యటనలో ఫ్లెక్సీ ని ప్రదర్శించాడు. అయితే సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దానిని తప్పు పట్టారు జగన్మోహన్ రెడ్డి. ఏకంగా ప్రెస్ మీట్ లోనే రఫా రఫా పుష్ప డైలాగులు గుర్తుచేస్తూ.. తప్పు లేదన్నట్టు మాట్లాడారు. కూటమి ప్రభుత్వ తీరుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అసహనంతో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దానినే ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు నచ్చవంటూ విరుచుకుపడ్డారు. నేరుగా జగన్మోహన్ రెడ్డి కి కౌంటర్ ఇచ్చారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
నేను సినిమా డైలాగ్లు చెప్పను
సింహం గడ్డం గీసుకుంది, నేను గీసుకోలేదు అనే డైలాగ్లు సినిమాలో కూడా చెప్పడానికి నేను ఇబ్బంది పడుతాను
మెడకాయలు కోసేస్తాం అంటే చొక్కా ఇప్పి చూపిస్తామా? – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/hSBQXPoFgv
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2025