Homeఆంధ్రప్రదేశ్‌YSRCP anti-Chandrababu app: 'రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో'.. వైసీపీ స్కానింగ్.. డబ్బులు పోగొట్టుకుంటున్న ప్రజలు!

YSRCP anti-Chandrababu app: ‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’.. వైసీపీ స్కానింగ్.. డబ్బులు పోగొట్టుకుంటున్న ప్రజలు!

YSRCP anti-Chandrababu app: సాధారణంగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీపై ఒక విమర్శ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కుంభకోణాలతో ప్రజలను మభ్యపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కారణంగానే సంక్షేమ పథకాలు అందించారన్న చిన్నపాటి కృతజ్ఞతలు లేకుండా ప్రజలు దారుణంగా ఓడించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దీని నుంచి అస్సలు గుణపాఠం నేర్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి. నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడితే బాగుండేది. కానీ చంద్రబాబు వైఫల్యాలను చెప్పేందుకు ఏకంగా ఒక యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆ యాప్ స్కాన్ చేస్తే చాలు చంద్రబాబు వైఫల్యాలు.. ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయింది ఇట్టే వస్తుందని చెబుతున్నారు. మొన్నటికి మొన్న తాడేపల్లిలో పార్టీ రాష్ట్ర శ్రేణులతో సమావేశమై ఈ యాప్ తో దిశ నిర్దేశం చేశారు. అనంతపురం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ప్రయోగం చేశారు. దీంతో స్కాన్ చేసిన వారి ఫోన్ పే యాప్ నుంచి 11 వేల రూపాయలు పోయాయి. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై సెటైర్లు పడుతున్నాయి.

Also Read: Devineni Uma Join YSRCP: వైసీపీలోకి టిడిపి మాజీ మంత్రి.. ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా!

సరికొత్త యాప్
కొద్దిరోజుల కిందట నియోజకవర్గ ఇన్చార్జిలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) తాడేపల్లి ప్యాలెస్ లో సమావేశం నిర్వహించారు. ఇకనుంచి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని పిలుపునిచ్చారు. దానికి ముద్దుగా ‘రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో’ అని పేరు కూడా పెట్టారు. ప్రత్యేకంగా యాప్ రూపొందించారు. ప్రతి కుటుంబానికి వెళ్లి ఈ యాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే.. ఆ కుటుంబం ఎంత నష్టపోయింది వస్తుందని పార్టీ శ్రేణులకు చెప్పారు. చంద్రబాబును మ్యానిఫెస్టో తోనే దెబ్బతీద్దామని జగన్ భావించి ఈ సరికొత్త ప్రయోగం చేశారు. అయితే వైసీపీకి సాంకేతిక పరిజ్ఞానం అనేది ఇబ్బందికరమే. ఈ యాప్ ను ఎలా తయారు చేశారో తెలియదు కానీ.. అనంతపురం జిల్లాలో మాత్రం ఫెయిల్ అయ్యింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది.

ప్రచారానికి తగ్గట్టుగానే.
జగన్మోహన్ రెడ్డి రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో( recalling Chandrababu man fest ) యాప్ గురించి ప్రకటించేసరికి సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం జరిగింది. క్యూఆర్ కోడ్ తో అకౌంట్లో డబ్బులు కొట్టేస్తారు జాగ్రత్త అంటూ చాలామంది పోస్టులు పెట్టారు. అయితే అనంతపురం జిల్లాలో ఈ అనుమానాలకు నిజం చేకూర్చేలా ఓ ఘటన జరిగింది. అనంతపురం జవహర్ కాలనీలో రీ కాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి, మిధున్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి తదితల నాయకులు హాజరయ్యారు. ఫోన్ స్కాన్ చేస్తే చంద్రబాబు మాసాలు బయటపడతాయని ఎర్రప్ప అనే వ్యక్తి కుటుంబం వద్దకు వెళ్లిన వైసిపి కార్యకర్తలు వారితో ఫోన్ స్కాన్ చేయించారు. అటు తరువాత వైసిపి నేతలతో పాటు కార్యకర్తలు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Also Read: Criticism on YSRCP Leaders: కుటుంబ గౌరవాలు.. వైసీపీ నేతలకు ఇప్పుడు గుర్తొచ్చాయా

ఫోన్ పే ఖాళీ
ఎర్రప్ప ( yaarappa )సాయంత్రం మార్కెట్కు వెళ్లి కొన్ని వస్తువులు కొనుగోలు చేశారు. డబ్బులు చెల్లించేందుకు ఫోన్ పే స్కాన్ చేయగా చెక్ ద అమౌంట్ అని వచ్చింది. బ్యాలెన్స్ చెక్ చేయగా జీరో అమౌంట్ చూపింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు ఎర్రప్ప. తాను ఉదయం నుంచి ఫోన్ పే వాడలేదని.. చివరిగా వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు యాప్ నకు స్కాన్ చేయించారని గుర్తు చేసుకున్నాడు. వారే డబ్బులు కొట్టేసి ఉంటారని అనుమానించాడు. వెంటనే అనంతపురం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వైసీపీ కార్యకర్తలకు ఇంకా దొంగ బుద్ధులు పోలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular