YSR Congress Party
YSR Congress Party : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థలకు సంబంధించి అవిశ్వాస తీర్మానాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు భయపడిపోతున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనలేక ముందుగానే రాజీనామాలు ప్రకటిస్తున్నారు. తాజాగా గుంటూరు కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల్లో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. అయితే ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్పొరేటర్లు కూడా లేరు. ఉన్నవారు సైతం మేయర్ ఆధీనంలో లేరు. అందుకే ఆయన తన పదవికి ముందస్తుగా రాజీనామా ప్రకటించారు.
Also Read : విజయసాయిరెడ్డి పై గొడ్డలి వేటు పెద్ద పని కాదు.. చంద్రబాబు రక్షణ కల్పించాలి
* పదవి ఒప్పందం
మున్సిపల్ కార్పొరేషన్ ( Municipal Corporation) ఎన్నికల్లో గుంటూరు పీఠాన్ని కైవసం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో కావటి మనోహర్ నాయుడు ను మేయర్ గా ఎన్నుకున్నారు. అయితే తొలి రెండున్నర ఏళ్లు మాత్రమే ఆయన పదవి చేపట్టాల్సి ఉంది. మలి రెండున్నర ఏళ్ళు రమేష్ గాంధీ అనే కార్పొరేటర్ పదవి చేపట్టాల్సి ఉంది. అయితే కార్పొరేటర్ గా పదవి బాధ్యతలు చేపట్టక ముందే ఆయన మరణించారు. దీంతో మనోహర్ నాయుడు కు ఎదురులేకుండా పోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల పట్ల ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి.
* అప్పట్లో దూకుడుగా..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మనోహర్ నాయుడు( Manohar Naidu ) దూకుడుగా ఉండేవారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఇష్టుడైన నాయకుడిగా మారిపోయారు. ఈ ఎన్నికల్లో చిలకలూరిపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు మనోహర్ నాయుడు కు ఇచ్చారు జగన్. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న విడదల రజినిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలామంది కార్పొరేటర్లు టిడిపి తో పాటు జనసేనలో చేరారు. ఇటీవల కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ నెల 17న మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టిడిపి తో పాటు జనసేన సిద్ధపడ్డాయి. తప్పకుండా తన పదవికి గండం ఉందని తెలిసిన మనోహర్ నాయుడు ముందే మేల్కొన్నారు. మేయర్ పదవికి రాజీనామా ప్రకటించారు.
Also Read : ఆ సమయంలోనే జగన్ టార్చర్.. సంచలన అంశాలను బయటపెట్టిన బాలినేని