ఆంధ్రప్రదేశ్‌YS Sharmila: ఇక లాభం లేదనుకుంటున్న షర్మిల!

YS Sharmila: ఇక లాభం లేదనుకుంటున్న షర్మిల!

YS Sharmila: వైయస్ షర్మిల మౌనముద్ర పాటిస్తున్నారు. ఆమె పెద్దగా మాట్లాడింది లేదు. అయితే ఉన్నట్టుండి ఆమె మౌనం దాల్చడం మాత్రం.. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం ఉంది. పిసిసి అధ్యక్షురాలిగా ఆమెను మార్చుతారన్న ప్రచారం ఒకవైపు.. ఇస్తామన్న రాజ్యసభ పదవి ఇవ్వకపోవడం ఇంకోవైపు.. సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేకపోవడంతో ప్రాధాన్యత తగ్గుతుందని మరోవైపు.. ఇలా షర్మిల సైలెన్స్ వెనుక అనేక రకాల కారణాలు వినిపిస్తున్నాయి. తరచూ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె.. ఉన్నట్టుండి సైలెంట్ కావడం చూస్తుంటే పెద్ద ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

* సోదరుడిని విభేదించి..
రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిలకు మంచి గుర్తింపు ఉంది. ఆమె జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు బలమైన మద్దతు దారుగా నిలిచారు. జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో షర్మిలకు గుర్తింపు లేదు వైసీపీలో. ఆపై సోదరుడు జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగత, కుటుంబ పరమైన విభేదాలు వచ్చాయి. అందుకే తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకున్నారు. వీలుకాకపోయేసరికి విభేదించిన కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరి.. ఏపీలో పార్టీ పగ్గాలు తీసుకున్నారు. పార్టీ అభివృద్ధి కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అపజయాన్ని శాసించగలిగారు షర్మిల.

* రాజ్యసభ పదవి హామీ..
అయితే ఎప్పటికప్పుడు జాతీయ రాజకీయాలు అనేవి మారుతూ ఉంటాయి. అలా రాజకీయాలు మారిన క్రమంలోనే కాంగ్రెస్ వైఖరి జగన్ విషయంలో మారినట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు కర్ణాటక నుంచి రాజ్యసభ పదవి ఇస్తామని షర్మిలకు హామీ ఉంది. ఆ హామీ అమలు చేయలేదు సరి కదా.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలను వేరే నేతకు అప్పగించాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు జాతీయస్థాయిలో కాంగ్రెస్ వైపు జగన్ మొగ్గు చూపుతున్నట్లు కూడా టాప్ నడుస్తోంది.. ఈ పరిణామాల క్రమంలో షర్మిల ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు. కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పగ్గాలు చేజారి పోతుండగా.. రాజకీయంగా తనకు ఎటువంటి ఉన్నతి లేకుండా పోయింది అనే ఆవేదన ఆమెలో కనిపిస్తోంది. అందుకే సైలెన్స్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి తెర వెనుక ఏం జరిగిందో వారికే తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

YS Sharmila: వైఎస్ షర్మిల దారెటు?!

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మౌనముద్ర లో ఉన్నారు. నిన్ననే రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. తండ్రికి ఆమె నివాళులు అర్పించారు. మీడియా ముందుకు వచ్చి పొడిపొడిగానే మాట్లాడి...

YS Sharmila: షర్మిల పొలిటికల్ సైలెన్స్..!

YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో షర్మిల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. మొన్న రాజ్యసభ పదవి దక్కకపోవడం నుంచి షర్మిల సైలెన్స్ గా ఉన్నారు. పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఆమె...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version