YS Sharmila: వైయస్ షర్మిల కు కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ షాప్ కి ఇచ్చింది. రాజ్యసభ పదవి ఇస్తున్నట్టు లీకులిచ్చి.. చివరి నిమిషంలో పక్కన పెట్టేసింది. మొన్ననే ఢిల్లీకి పిలిచి అగ్రనేత రాహుల్ గాంధీ అభయం ఇచ్చారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రమోట్ చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. రెట్టింపు ఉత్సాహంతో ఆమె ఏపీకి వచ్చారు. కానీ ఇంతలోనే కర్ణాటకలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. సీఎం డీకే శివకుమార్ చేతులెత్తేసారు. షర్మిలకు ఇవ్వాలనుకున్న రాజ్యసభ పదవి.. హై కమాండ్ కోటాలో కాంగ్రెస్ జాతీయ మీడియా విభాగం చైర్మన్, అధికార ప్రతినిధి పవన్ ఖేరా కు కేటాయించారు. దీంతో షర్మిలకు షాక్ తప్పలేదు.
* పార్టీ విలీన సమయంలో..
తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. పాదయాత్ర కూడా చేశారు. పార్టీ వర్కౌట్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ప్రయత్నించారు. కానీ అవకాశం దక్కలేదు. అప్పట్లో రాజ్యసభ పదవికి హామీ ఇచ్చింది కాంగ్రెస్ హై కమాండ్. ఏదో ఒక రాష్ట్రం నుంచి సర్దుబాటు చేస్తామని చెప్పుకొచ్చింది. ఇప్పుడు కర్ణాటక నుంచి ఆ అవకాశం వచ్చింది. కానీ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ హై కమాండ్. జాతీయస్థాయిలో ప్రముఖంగా ఉన్న పవన్ ఖేరాకు ఖరారు చేసింది.
* జాతీయ కోటాలో..
కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచే మూడు రాజ్యసభ పదవులు ఉన్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఛాన్స్ దక్కింది. రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ కుమారుడు మన్సూర్ ఆలీ ఖాన్, పవన్ ఖేరాలను ఖరారు చేసింది కాంగ్రెస్ హై కమాండ్. అయితే షర్మిలకు ఛాన్స్ ఇస్తామని చెప్పింది అగ్రనాయకత్వం. ఒక విధంగా ఇది షర్మిలకు షాకింగ్ పరిణామమే. డీకే శివకుమార్ ద్వారా ఆమె గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ స్థానిక పరిస్థితులకు ఆయన తలవంచక తప్పలేదు. మరోసారి షర్మిల కు రాజ్యసభ పదవి ఇస్తామని హై కమాండ్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. అయితే పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం పై ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
