YS Sharmila: వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ తన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మపై జాతీయ కంపెనీల లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన తర్వాత పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. వైసిపి అనుకూల మీడియాలో షర్మిలను టార్గెట్ చేస్తూ వస్తున్న కథనాలు చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా వైయస్ కుటుంబ అభిమానుల్లో ఒక రకమైన గందరగోళంలో పడేస్తున్నాయి. ఈ తరుణంలో షర్మిల అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ఈ పరిణామాల వెనుక ఉన్న లోగుట్టును బయటపెట్టారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి గురించి మల్లి విజయమ్మ ఒక పుస్తకం రాశారని.. అందులో తన తండ్రి గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారని గుర్తు చేశారు షర్మిల. రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒక ఎత్తు అయితే.. తన బిడ్డ షర్మిల ఒక ఎత్తు అని రాశారని ప్రస్తావించారు. నాన్నకు తనంటే ఎంతో ప్రాణమని. నాన్న తనను ఎప్పుడూ ఆడపిల్లగా చూడలేదన్నారు. తరం బతికి ఉన్నన్ని రోజులు నలుగురు మనవళ్లు, మనవరాలు తనకు సమానం అనేవారని చెప్పుకొచ్చారు. తను స్థాపించిన అన్ని సంస్థలు, వ్యాపారాల్లో సమాన వాటా కూడా ఉండాలనే వారని గుర్తు చేశారు షర్మిల. అయితే దీనిని తిరస్కరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని.. ఆయన కేవలం గార్డియన్ అన్న విషయాన్ని మరిచిపోతున్నారని చెప్పుకొచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉద్దేశం కేవీపీ రామచంద్రరావు, వై వి సుబ్బారెడ్డి, సాయి రెడ్డి, భారతికి తెలుసునన్నారు. ప్రస్తుతం షర్మిల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* అప్పట్లో ఆస్తి పంపకాలు జరగలే
వైయస్ రాజశేఖర్ రెడ్డి 2010లో మరణించిన సంగతి తెలిసిందే. అయితే రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం ఆస్తి పంపకాలు జరగలేదని షర్మిల చెబుతున్నారు. ఈరోజు వరకు తనకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా తన చేతిలో లేదని చెబుతున్నారు. జగన్ స్వరార్జితం అని చెప్పుకుంటున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని చెబుతున్నారు షర్మిల. రాజశేఖర్ రెడ్డి బతికున్న కాలంలో ఆస్తులు పంపిణీ చేశారనేది అవాస్తవమని… తాను జగన్ ఆస్తిలో వాటా అడుగుతున్నానని చెబుతుండడం కూడా హాస్యాస్పదమన్నారు. తనకంటూ వ్యక్తిగతంగా ఆస్తులపై మోజు లేదని.. వీళ్లు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదని షర్మిల తేల్చి చెప్పారు.
* జగన్ వైఖరి తోనే
అయితే తాజాగా వైఎస్ కుటుంబ అభిమానుల కోసం షర్మిల లేఖ రాయడం విశేషం. షర్మిల తనను మానసికంగా క్షోభ పెడుతోందని.. ప్రత్యర్థులతో చేతులు కలిపి రాజకీయంగా తనను దెబ్బతీసిందని జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. జగన్ తనను ఎలా మోసం చేసింది షర్మిల లేఖ రాసిన సంగతి తెలిసిందే. దానిని టిడిపి సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీనిని తప్పు పట్టారు జగన్. తన కుటుంబంలో చిచ్చు రేపుతున్నారని.. ప్రతి కుటుంబంలో ఉండే వ్యవహారాలే తమ కుటుంబంలో ఉన్నాయని.. ఇదంతా చంద్రబాబు పనేనని అన్నట్టు జగన్ ఆరోపణలు చేశారు. అయితే తాను ఆస్తికోసం ఎప్పుడు వెంపర్లాడలేదని.. తన వెనుక ఎవరూ లేరని.. ఒక ఆడబిడ్డకు ఎలా మోసం జరిగిందో గమనించుకోవాలని సూచిస్తూ షర్మిల అభిమానులకు లేఖ రాయడం విశేషం.