NTR Koratas Devara 2 : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా 500 కోట్ల వరకే కలెక్షన్లను రాబతట్టింది. ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమాతో వెయ్యి కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టాలని ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అది సాధ్యపడలేదు. మరి ఇలాంటి సందర్భంలో కొరటాల శివ ఇచ్చిన సక్సెస్ పట్ల ఆయన సంతృప్తి చెందలేదు. కాబట్టి దేవర 2 సినిమా ఎప్పుడు ఉంటుంది అనేదానిమీద సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇక ఈ రకంగా ఎన్టీఆర్ కొరటాల మధ్య కూడా కొంత గ్యాప్ అయితే పెరిగిందని వాళ్ళ మధ్య చిన్న గొడవలు కూడా జరుగుతున్నాయి అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో దేవర 2 సినిమా చేసే ఆలోచనలో ఇద్దరూ ఉన్నారా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలను కొరటాల శివ హాండిల్ చేయగలడు. కానీ గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాలను అంత బాగా డీల్ చేయలేడనే విషయం అయితే దేవర సినిమాతో స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి కొరటాల శివ ఇప్పుడు దేవర 2 సినిమాను పక్కనపెట్టి మరొక హీరోతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా వరుస సినిమాతో బిజీ అయిపోయాడు.
ఇంకా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమా మీద తన పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ రూపంలో ఒక మంచి సక్సెస్ ని అందించాడు. ఇప్పుడు దేవర సినిమాతో కూడా ఒక డీసెంట్ సక్సెస్ అయితే ఇచ్చాడు.
కాబట్టి రెండు సక్సెస్ లను అందించిన ఈ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మరొక సినిమా చేయాలని తన అభిమానులైతే కోరుకుంటున్నారు. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న దేవర 2 సినిమా ఉంటుందా? ఉండదా అనే విషయం మీద క్లారిటీ రావాలంటే మాత్రం సినిమా యూనిట్ నుంచి ఎవరో ఒకరు స్పందించాల్సిన అవసరమైతే ఉంది…
సినిమా మీద ప్రొడ్యూసర్ అయిన నందమూరి కళ్యాణ్ రామ్ స్పందిస్తాడు అంటూ కొద్దిరోజులుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఆయన కూడా ఎలాంటి స్పందన తెలియజేయకపోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక సందిగ్ధత అయితే నెలకొంది…