YS Jagan Mohan Reddy : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజున, మాజీ సీఎం జగన్(Ex CM Jagan) ప్రతిపక్ష హోదా గురించి డిమాండ్ చేస్తూ, నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ అవ్వడం, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వచ్చి ‘భారత రాజ్యాంగం ప్రకారం నీకు ప్రతిపక్ష హోదా రాదు, ఈ 5 ఏళ్ళు దాని గురించి మర్చిపోండి. మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ కి వెళ్ళండి’ అంటూ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. నేడు బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన దృష్టికి పవన్ కళ్యాణ్(Dy cm Pawan Kalyan) చేసిన కామెంట్స్ ని విలేఖరులు తీసుకొచ్చారు. దీనిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ లో ప్రకంపనలు పుట్టేలా చేసాయి. సోషల్ మీడియా అంతటా ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ.
Also Read : నాగబాబు ఎమ్మెల్సీ.. కూటమి ఎట్టకేలకు ఫిక్స్!
ఆయన సమాధానం ఇస్తూ ‘పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్ కి ఎక్కువ..ఎమ్మెల్యే కి తక్కువ..జీవితం లో మొట్టమొదటిసారి మొన్న ఎమ్మెల్యే అయ్యాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. జగన్ చేసిన ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ పరువు తీసేలా ఉన్నాయి. సోషల్ మీడియా లో అనేక మంది ఈ కామెంట్స్ ని షేర్ చేసి నవ్వుకుంటున్నారు. పొత్తు లేకుండా ఒంటరిగా పోతే మళ్ళీ ఎమ్మెల్యే అవ్వడు అనే విషయం వాస్తవమే కదా, దీనికి జనసైనికులు ఎందుకు అంతలా ఊగిపోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ కూడా అందుకే రాజకీయంగా పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు విమర్శించడని, అసలు పవన్ కళ్యాణ్ ఆయన దృష్టిలో రాజకీయ నాయకుడే కాదని, అందుకే అతని పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడడు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. జనసేన నాయకులూ కూడా జగన్ కామెంట్స్ కి ధీటుగా సమాధానం ఇవ్వడం లో విఫలం అవుతున్నారు.
Also Read : వైసీపీకి షాక్.. ఆ ఇద్దరు సీనియర్లు పార్టీకి దూరమైనట్టే!
లాస్ట్ పంచ్ మనది అయితే, ఆ కిక్కే వేరప్పా.. @YSRCParty @JaganannaCNCTS pic.twitter.com/aWezAQLSsA
— YSRCP Europe (@YSRCPEurope) March 5, 2025
ఎవరు కార్పొరేటర్‌కు ఎక్కవ MLAకు తక్కువ pic.twitter.com/LwO4euxePc
— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) March 5, 2025