Heroine Srileela :శ్రీకరోనా లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ లో స్టార్ లీగ్ రేంజ్ కి వెళ్లిన నటి శ్రీలీల(Heroine Srileela). పెళ్లి సందడి అనే చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ అమ్మాయి, ‘ధమాకా’ చిత్రం తో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈమధ్య కాలం లో రవితేజ చేసిన సినిమాలలో అతి పెద్ద హిట్ చిత్రం అదే. ఆయన కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇదే. అయితే ఈ సినిమాలో అసలు విషయమే లేదని, కేవలం శ్రీలీల డ్యాన్స్ వల్లే ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యిందని, లేకపోతే పెద్ద ఫ్లాప్ అయ్యేదని ఇలా పలు రకాల కామెంట్స్ అప్పట్లో వినిపించాయి. ఈ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన(Trinadharao Nakkina) రీసెంట్ గా సందీప్ కిషన్(Sundeep Kishan) తో కలిసి ‘మజాకా'(Majaka Movie) అనే చిత్రం చేసాడు. ఈ మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొన్న త్రినాథ రావు నక్కిన ని అప్పట్లో సోషల్ మీడియా లో వైరల్ అయిన ఈ కామెంట్స్ గురించి అడిగారు.
Also Read : మళ్ళీ ప్రేమలో పడడంపై మొట్టమొదటిసారి స్పందించిన సమంత..ఇంత పెద్ద మాట అనేసిందేంటి!
ఆయన చాలా సున్నితంగానే ఆ ప్రశ్న కి సమాధానం చెప్పగా, రచయిత ప్రసన్న కుమార్(Prasanna Kumar) మాత్రం చాలా ఘాటుగానే స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘హీరోయిన్ వల్ల సినిమా ఆడడం ఏమిటి?, జోక్ చేస్తున్నారా?, శ్రీలీల ధమాకా చిత్రం లో అద్భుతంగా డాన్స్ వేసింది. అది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఆమె వల్లనే సినిమా హిట్ అయ్యిందని అనుకోవడం మూర్ఖత్వం. ధమాకా తర్వాత శ్రీలీల ఎన్ని సినిమాల్లో నటించింది?, అన్నిట్లోనూ ఆమె అందంగా కనిపించింది. డ్యాన్స్ అయితే ధమాకా లో కంటే అద్భుతంగా చేసింది. మరి ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయా?, అసలు ధమాకా తర్వాత ఆ అమ్మాయి నటించిన సూపర్ హిట్ సినిమా ఒక్కటి చెప్పండి చూద్దాం. కేవలం పాటల వల్ల సినిమాలు సూపర్ హిట్ అవుతాయి అనుకుంటే పెద్ద పొరపాటు’.
‘పాటలు సినిమాలో మహా అయితే 20 నిమిషాలు ఉంటాయి అంతే. సినిమా మొత్తం రెండు గంటలు చూడాలి. ఆ రెండు గంటలు ప్రేక్షకులను థియేటర్స్ లో కూర్చోబెట్టి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తే, హీరోయిన్ వేసే డ్యాన్స్, పాటలు బోనస్ అయ్యి, సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. ధమాకా కి స్టోరీ, పాటలు, కామెడీ, డ్యాన్స్ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి. అందుకే ఆ చిత్రం కమర్షియల్ గా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన అన్న మాటల్లోనూ నిజముంది. ఎందుకంటే ఒక సినిమా అనేది కేవలం ఒకరి వల్ల హిట్ కాదు, ఎంతో మంది కష్టపడి పనిచేస్తేనే సూపర్ హిట్ అవుతుంది. ఇలా కేవలం ఒకరికి మాత్రమే క్రెడిట్ ఇవ్వడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
Also Read : కూతురు వల్లే సింగర్ కల్పన చనిపోవాలని అనుకుందా..? స్పృహలోకి వచ్చిన తర్వాత సంచలన నిజాలు బయటపెట్టిన కల్పన!