YS Jagan Lotus Pond visit news: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) చాలా రోజులకు హైదరాబాద్ వెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పెద్దగా హైదరాబాద్ వెళ్ళిన దాఖలాలు లేవు. ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన ఆయన స్వయంగా కోర్టుకు హాజరుకావాలని సిబిఐ న్యాయస్థానం ఆదేశించింది. దాని నుంచి మినహాయింపులు కూడా కావాలని కోరారు జగన్మోహన్ రెడ్డి. అందుకు కోర్టు అంగీకారం తెలపలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 21న జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు. అయితే ఆయన లోటస్ ఫండ్ కు వెళ్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆయన లోటస్ ఫండ్ కు వెళ్లకపోతే మాత్రం ఆస్తి షర్మిలదిగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే గత కొంతకాలంగా లోటస్ ఫండ్ లో షర్మిల నివాసం ఉంటున్నట్లు ప్రచారం నడిచింది. అందుకే జగన్మోహన్ రెడ్డి అటువైపు చూడనట్లు టాక్ నడిచింది. అందుకే ఇప్పుడు జగన్ వెళ్తారా? వెళ్ళరా? అనేది చర్చనీయాంశంగా మారింది.
Also Read: చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సలహా!
నిలిచిన రాకపోకలు..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. అయితే అప్పట్లో హైదరాబాద్ లోటస్ ఫండ్( Lotus fund) నుంచి ఏపీకి రాకపోకలు సాగించేవారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన టూరిజం పొలిటీషియన్ గా అప్పట్లో అభివర్ణించేవారు. హైదరాబాద్ లోటస్ ఫండ్ లో ఉండి సాక్షితో పాటు ఇతర వ్యాపారాలను చూసేవారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను పోషించేవారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లి నివాసానికి మకాం మార్చారు. మధ్య మధ్యలో హైదరాబాద్ వెళ్లి లోటస్ ఫండ్ లో ఉండేవారు. కానీ ఓడిపోయిన తర్వాత మాత్రం హైదరాబాద్ కంటే బెంగళూరుకు ప్రాధాన్యమిస్తున్నారు. బెంగళూరులోని యెలహంక ప్యాలెస్ లో ఎక్కువగా గడుపుతున్నారు.
అక్కడ షర్మిల నివాసం..
షర్మిల( Sharmila) ఆస్తి వివాదం నేపథ్యంలో సోదరుడు జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరి మధ్య కోర్టు వివాదాలు, కేసులు నడుస్తున్నాయి. ఇటువంటి తరుణంలో షర్మిల లోటస్ ఫండ్ లో నివాసం ఉంటున్నారని.. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ లో సేద తీరుతున్నారన్నది వాస్తవం. పైగా హైదరాబాద్ ముఖం చూడడమే మానేశారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అక్కడ తన సన్నిహితుడు కేసీఆర్ ఓడిపోవడం, ఆపై కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అటువైపుగా వెళ్లడం లేదన్నది ఒక వాదన. అయితే ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు సిబి ఐ న్యాయస్థానానికి ఈ నెల 21న హాజరుకానున్నారు. ఈసారి లోటస్ ఫండ్ కు వెళ్తారా? అన్నది అనుమానమే. ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్ వెళ్లారు గానీ లోటస్ ఫండ్ ముఖం చూడలేదు. ఇప్పుడు కూడా వెళ్ళరని సన్నిహితులు చెబుతున్నారు.
Also Read: సీరియస్ ఆలోచన దిశగా బొత్స!
కోర్టు ఆదేశాలతో..
గత నెలలో విదేశీ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్రమాస్తుల కేసుల్లో జగన్ బెయిల్ పై బయట ఉన్నారు. 2012లో 16 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. ఆయనపై కేసులు ఉండడంతో విదేశాలకు వెళ్ళినప్పుడు కోర్టు అనుమతి తప్పనిసరి. అందుకే ఆయన కోర్టు అనుమతి కోరిన సమయంలో న్యాయస్థానం విదేశాల నుంచి వచ్చిన వెంటనే వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని సూచించింది. దీంతో జగన్ ఈనెల 21న కోర్టుకు హాజరుకానున్నారు. అందుకే ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది.