Delhi Car Video: నేటి తరానికి అడ్డు అదుపు లేదు . పెద్దవాళ్లు ఏమనుకుంటారనే భయం లేదు. పదిమందిలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎలా చూస్తారోననే బిడియం లేదు. పట్టపగ్గా లు లేకుండా.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తాము హీరోలమనే భ్రమలో చాలామంది యువత ఉన్నారు. ఇక యువతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . వారు కూడా సినిమాల మాయలో పడి.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం ఏమనుకుంటుందోనని సోయిని కూడా పక్కనపెట్టి.. దారుణంగా వ్యవహరిస్తున్నారు. సంఘటన ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. చలికాలంలో అయితే చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇక్కడ కాలుష్యం తారస్థాయిలో ఉంటుంది. అటువంటి ఈ నగరంలో యువకుడు విచ్చలవిడిగా ప్రవర్తించాడు. తాను ప్రయాణిస్తున్న కారులో సర్కస్ ఫీట్లు చేశాడు. కారు పైకెక్కి స్పైడర్ మాన్ లా విన్యాసాలు చేశాడు. అంతటితో అతడు ఆగలేదు.. అదే కారులో ముందు సీట్లో ప్రయాణిస్తున్న ప్రియురాలికి ముద్దు కూడా ఇచ్చాడు. మరో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఈ వ్యవహారాన్ని మొత్తం వీడియో తీశాడు. దానిని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీ నగరంలోని మెట్రోలో ఆ మధ్య యువతీ యువకులు అత్యంత దారుణమైన పనులకు పాల్పడ్డారు. ముఖ్యంగా లిఫ్ట్ లలో ఎవరూ చేయకూడని దారుణాలు చేశారు. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. సీసీ కెమెరాలలో రికార్డు అయినా ఈ దృశ్యాలు మీడియాలో ప్రధానంగా ప్రచారం కావడంతో పోలీసులు తీవ్రంగా దృష్టి సారించారు. దీంతో ఈ వ్యవహారాలకు బ్రేక్ పడింది.
ఇప్పుడు నడిరోడ్ల మీదనే యువతి యువకులు రెచ్చిపోతున్నారు. అడ్డగోలు పనులు చేస్తూ తాము హీరోలమని బిల్డప్ ఇస్తున్నారు. చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలుగుతుందని కనీస స్పృహ కూడా లేకుండా పనికిమాలిన పనులకు పాల్పడుతున్నారు. వాస్తవానికి ఈ తరహా దారుణాలకు చెక్ పెట్టాలని ఢిల్లీ ప్రజలు కోరుతున్నారు. కాగా, ఆ యువకుడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు స్పందించారు. కారు నెంబర్ ఆధారంగా భారీగా అపరాధ రుసుము విధించారు.. మరొకసారి ఇటువంటి ఘటనకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు..