Yogandhra 2025: 11 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఏర్పాట్లను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయన పలుమార్లు విశాఖపట్నం నగరాన్ని సందర్శించారు. ప్రత్యేకంగా అధికారులను నియమించి ఎప్పటికప్పుడు ఏర్పాట్ల గురించి ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు.
Also Read: యోగా డే కోసం విశాఖనే మోడీ ఎందుకు ఎంచుకున్నారు? దీని ప్రత్యేకతలేంటి?
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీతో కలిసి వేడుకలలో పాల్గొనబోతున్నారు. యోగా దినోత్సవం లో ఐదు లక్షల మంది పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పాలని యోచిస్తోంది. యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది. యోగాంధ్ర వేడుకలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుమారు 100 టూరిస్ట్ ప్లేస్లలో.. స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ యోగా డే ద్వారా వైజాగ్ నగరానికి ఇంటర్నేషనల్ లెవెల్ లో టూరిజం స్పాట్ గా పేరు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు ప్రజలకు ఆరోగ్య మీద అవగాహన ఏర్పడుతుంది.
ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించింది. యోగా డేలో పాల్గొనే వారికి సామాగ్రి అందిస్తారు.. తాత్కాలికంగా మరుగుదొడ్లను, వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇక పరీక్ష యోగాసెషన్ పేరుతో జూన్ 20న.. ఏర్పాట్లను.. కల్పించిన సౌకర్యాలను అధికారులు పరిశీలిస్తారు. ఈ దినోత్సవం లో తాము కంకణ బద్దులం కావాలి అనుకుంటే విశాఖపట్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొనసాగే అధికారిక వెబ్సైట్ లేదా.. ఈ వేడుకల్లో భాగస్వామ్యులైన యోగా సెంటర్లలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అంతేకాదు ముందస్తుగా పేర్లను నమోదు చేసుకుంటే యోగా మ్యాట్, స్థలం ఏర్పాటు చేస్తారు..ఈ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ద్వారా విశాఖపట్నం నగరానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు లభిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతేకాకుండా పర్యాటకంగా లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వంటి వారు హాజరవుతున్న నేపథ్యంలో ఈ వేడుకలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
యోగా దినోత్సవానికి ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వారికి తగ్గట్టుగానే సౌకర్యాలను అధికారులు కల్పించారు. ఇప్పటికే ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన తాగునీటి సౌకర్యం కల్పించారు. మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి హాజరవుతున్న నేపథ్యంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్నారు.