8 Vasanthalu Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్న క్రమంలో యంగ్ డైరెక్టర్స్ డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే మధురం (Madhuram) అనే షార్ట్ ఫిల్మ్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ఫణీంద్ర నరిశెట్టి (Phanidra Narishetti)…ఆ తర్వాత బ్రహ్మానందం కొడుకు అయిన గౌతం ను హీరోగా పెట్టి ‘మను’ (Manu) అనే సినిమా చేశాడు. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాకపోయిన ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. మరి ప్రస్తుతం ఆయన ‘8 వసంతాలు’ (8 Vasanthalu) అనే ఒక సినిమా చేశాడు. ఆ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక అమ్మాయి తన లైఫ్ లో 8 సంవత్సరాల పాటు ఏం జరిగింది. ఆమె ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది. ఆమె ప్రేమ గెలిచిందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సినిమాలోని కోర్ పాయింట్ ని దర్శకుడు చాలా తెలివిగా చెప్పాలనే ప్రయత్నం అయితే చేశాడు. కానీ అది పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదు. ఇక మొదట సినిమాని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద మనకున్న అభిప్రాయం కొంచెం కొంచంగా తగ్గిపోతూ ఉంటుంది. సినిమాని సీరియల్ లాగా సాగదీస్తూ స్టార్ట్ చేశారు. దానివల్ల దర్శకుడు తను చెప్పాలనుకున్న పాయింట్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికి దానిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం మాత్రం ప్రేక్షకుడికి అంత బాగా కనెక్ట్ అవ్వలేదనే చెప్పాలి.
ఇక ప్రతి సీన్ లోను కోర్ ఎమోషన్ హైలెట్ అవుతుంది అనుకున్న ప్రతి సందర్భంలో మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆ సీన్స్ ను డామినేట్ చేయడం వల్ల అందులో ఉన్న ఎమోషన్ అయితే పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. చాలా సందర్భాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఎప్పుడు చెవుల్లో సుత్తిలాగా మోగుతూనే ఉంది. ఒక అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది ఆమె ఏ సందర్భంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది అనే కొన్ని సీన్స్ ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు… ప్రేమ అంటే ఏంటి అనే విషయాలను కూడా ఈ సినిమాలో చాలా బాగా డిస్కస్ చేశారు. కానీ దాన్ని స్క్రీన్ మీద ఇంకాస్త ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది…
అనంతిక చెప్పిన కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. అవి కొంత వరకు ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేశాయి. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే సినిమాకి ఏ మాత్రం ప్లస్ అవ్వలేదు. అసలు ఆ యాక్షన్ ఎపిసోడ్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. డైరెక్టర్ ఇంతకు ముందు ఈవెంట్ లో చెప్పినట్టుగా ఆయన కూడా కమర్షియల్ డైరెక్టర్ గా సినిమాలు చేయగలను అని తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి ఆ ఫైట్ డిజైన్ చేసినట్టుగా అనిపించింది తప్ప సినిమాలోని సీన్స్ కి దానికి అసలు సంబంధం లేదు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే అనంతిక వన్ ఉమెన్ షో చేసిందనే చెప్పాలి. ఆమె నటన సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. సినిమా కంటెంట్ లో చాలా విషయం ఉంది దానికి తగ్గట్టుగానే నటిగా తను కూడా తన పాత్రకి ప్రాణమైతే పోసింది. తన పాత్రలో ఎక్కడ కూడా పరిమితిని మించి నటించలేదు. ఆ క్యారెక్టర్ కి ఆ సీన్ కి ఎంత అయితే యాక్టింగ్ కావాలో ఆ అంత వరకే నటించింది. ప్రతి సీన్ లో సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చింది…
మెయిల్ లీడ్ లో చేసిన రానా దుగ్గిరాల కూడా తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించాడు. ఇక ఆ అమ్మాయికి సపోర్ట్ ఇస్తు ఎప్పటికప్పుడు ఆయన పండించిన హావభావాలు కూడా చాలా బాగున్నాయి… హను రెడ్డి అక్కడక్కడ కొంచెం కామెడీని పండించే ప్రయత్నం అయితే చేశాడు మొత్తానికి అయితే తను సినిమాకి కొంతవరకు ప్లస్ అయింది…ఇక షార్ట్ ఫిలిమ్స్ లో ఎక్కువగా కనిపించే కన్నా పసునూరి సైతం అక్కడక్కడ తన నటనతో ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు…సంజన హర్దగేరి కూడా ఒకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అంత పెద్దగా ప్లస్ అయితే అవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకుడికి మరింత కనెక్ట్ అయి ఉండేది. ముఖ్యంగా కొన్ని సీన్లు చూస్తున్నప్పుడు ఆ సీన్స్ లోని ఇంటెన్స్ అయితే ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేకపోయింది. దానికి కారణం ఏంటి అంటే బ్యాగ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. అది కనక కాస్త ఎలివేట్ అయినట్లయితే సీన్స్ లోని ఎమోషన్ ఇంకాస్త బలంగా ఎలివేట్ అయ్యేది…
విశ్వనాథ్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ కొంతవరకు పర్లేదు అనిపించింది. ముఖ్యంగా అందమైన లొకేషన్స్ ని చూపించడంలో ఆయన చాలావరకు ఇంట్రెస్ట్ చూపించినట్టుగా తెలుస్తోంది. కొన్ని డిఫరెంట్ బ్లాక్ లని ట్రై చేసే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తోంది… సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలావరకు రిచ్ గానే ఉన్నాయి…
ప్లస్ పాయింట్స్
కథ
అనంతిక యాక్టింగ్
కొన్ని డైలాగ్స్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ లాగ్ అయింది
కొన్ని సీన్స్ లో డైరెక్షన్ బాగోలేదు…
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.25/5