Yoga Day Rules In Vizag: ప్రపంచ యోగ దినోత్సవ( world yoga day ) వేడుకలకు విశాఖ నగరం సిద్ధమవుతోంది. దాదాపు 5 లక్షల మందితో ఒకేసారి యోగాసనాలు వేయించనున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 130 వరకు కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకేసారి అందరూ యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రపంచ రికార్డులకు చేరువయ్యేలా ప్లాన్ వేశారు. ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి భారీగా జనాలు రానున్నారు. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా బీచ్ రోడ్ లో రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే వాహనాల కోసం నగరంలో 75 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. అయితే ఇది బీచ్ రోడ్డుకు అర కిలోమీటర్ దూరంలో వీటిని ఏర్పాటు చేశారు. అక్కడ వాహనాలను పార్కింగ్ చేసి యోగా డే లో పాల్గొనవలసిన వారు అక్కడ చేరుకోవాల్సి ఉంటుంది.
పార్క్ హోటల్( Park Hotel) సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎనిమిది పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెన్నేటి పార్కు వద్ద మరో పదహారు పార్కింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు.రుషికొండకు సమీపంలోని తెన్నేటి * పార్క్ హోటల్( Park Hotel) సమీపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎనిమిది పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెన్నేటి పార్కు వద్ద మరో పదహారు పార్కింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు.
రుషికొండకు సమీపంలోని తెన్నేటి పార్కు వద్ద మరో 21 పార్కింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు.
రుషికొండ తిమ్మాపురం వద్ద తొమ్మిది పార్కింగ్ కేంద్రాలు.
తిమ్మాపురం కాపులుప్పాడ వద్ద రెండు పార్కింగ్ కేంద్రాలు.
కాపులొప్పాడ ఐఎన్ఎస్ కళింగ వద్ద ఒకటి, ఐఎన్ఎస్ కళింగ భీమిలి బీచ్ రోడ్ లో నాలుగు చోట్ల పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఐటీ సెజ్ లా కాలేజీ వద్ద మరో ఆరు పార్కింగ్ కేంద్రాలు అందుబాటులోకి తెచ్చారు.
Also Read: Yoga : మంచి నిద్ర, ఆనందం, ప్రశాంతత కోసం ఈ యోగాను చేసేయండిలా..
వేర్వేరు రూట్ లలో వచ్చే వారికి
విశాఖ నగరంలో ప్రవేశించే ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు పార్కింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. శ్రీకాకుళం నుంచి వచ్చే వాహనాలకు కొన్ని కేంద్రాలను.. విజయనగరం జిల్లా నుంచి వచ్చే వాహనాలకు మరికొన్ని కేంద్రాలను.. అరకు రూట్ లో వచ్చే వాహనాలను మరికొన్ని కేంద్రాలను కేటాయించారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు సైతం కొన్ని కేంద్రాలను కేటాయించారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.