Yashmi And Bigg Boss Winner News: బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ తోటి కంటెస్టెంట్ యష్మి గౌడతో సన్నిహితంగా ఉన్నాడు. వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే పుకార్లు చెలరేగాయి. హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా యష్మి-నిఖిల్ మధ్య ఎఫైర్ నడుస్తుందనే సందేహాలు ఉన్న నేపథ్యంలో… బిగ్ బాస్ విన్నర్ ఓపెన్ అయ్యాడు.
కన్నడ పరిశ్రమకు చెందిన నిఖిల్(NIKHIL) తెలుగులో సీరియల్ నటుడిగా పాప్యులర్ అయ్యాడు. కోయిలమ్మ, గోరింటాకు వంటి సీరియల్స్ లో ప్రధాన పాత్రలు చేశాడు. స్టార్ మా సీరియల్ నటుడిగా ఆయనకు బిగ్ బాస్(BIGG BOSS TELUGU SEASON 8) సీజన్ 8లో కంటెస్ట్ చేసే ఛాన్స్ దక్కింది. హౌస్లో సత్తా చాటిన నిఖిల్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఫిజికల్ గేమ్స్ తో పాటు మైండ్ గేమ్ లో కూడా మెరిట్ కనబరిచి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఒకరిద్దరు లేడీ కంటెస్టెంట్స్ తో నిఖిల్ సన్నిహితంగా ఉండేవాడు. మొదట్లో సోనియా ఆకుల తో స్నేహం చేశాడు.
పృథ్వి, సోనియా, నిఖిల్ ఒక జట్టుగా ఉన్నారు. సోనియా ఆట తీరు విమర్శలపాలు కావడంతో ఆమె త్వరగా ఎలిమినేట్ అయ్యింది. అనంతరం యష్మి గౌడకు దగ్గరయ్యాడు. యష్మి సైతం కన్నడ అమ్మాయి. నిఖిల్ పట్ల యష్మి(YASHMI GOWDA) కూడా ఆసక్తి చూపించేది. ఈ క్రమంలో వీరికి మ్యూచువల్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అనూహ్యంగా చివరి వారాల్లో వ్యవహారం చెడింది. యష్మి తన వెనకాల తిరుగుతుంది అన్నట్లు నిఖిల్ ప్రేక్షకుల్లోకి తప్పుడు సందేశం పంపాడు అని ఆమె ఫీల్ అయ్యింది. ఈ విషయంలో ఇద్దరికీ గొడవైంది. ఫైనల్ లో ఉంటుంది అనుకున్న యష్మి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది.
యాష్మి ఎలిమినేట్ కావడానికి నిఖిల్ కారణం అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. తాజాగా యష్మి తో తన రిలేషన్ పై ఓపెన్ అయ్యాడు. ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ వర్ష కిస్సిక్ పాడ్ క్యాస్ట్ పేరుతో ఓ టాక్ షో చేస్తుంది. ఈ షోలో నిఖిల్ పాల్గొన్నాడు. ఒక రూమ్ లో లాక్ అయితే ఎవరితో ఉండాలి అనుకుంటావు? వర్ష లేక యష్మి అని అడగ్గా… ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాను అని నిఖిల్ తెలివిగా సమాధానం చెప్పాడు. యష్మి నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. మేమిద్దరం కలిసి ఉండాలని కొందరు ఫ్యాన్ పేజెస్ ఏర్పాటు చేశారు. రేపు యష్మి మరొకరిని వివాహం చేసుకుంటే ఆమెకు ఇబ్బంది అవుతుంది… అన్నాడు నిఖిల్.
యష్మితో తనకు ఎలాంటి ఎఫైర్ లేదని తేల్చి చెప్పాడు. కాగా గతంలో తనతో కలిసి నటించిన కావ్యశ్రీతో నిఖిల్ కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి విహరించిన ఫోటోలు, వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇక పెళ్లే తరువాయి అనుకుంటున్న తరుణంలో విడిపోయారు. కావ్యశ్రీ తిరిగి వస్తే కలిసి జీవించడానికి సిద్ధమని బిగ్ బాస్ హౌసులో నిఖిల్ అన్నాడు. కావ్యశ్రీ మాత్రం నిఖిల్ కి కౌంటర్ ఇచ్చింది. నిఖిల్ మీద తాను చాలా కోపంగా ఉన్నట్లు మాత్రం అర్థం అవుతుంది.