Homeఆంధ్రప్రదేశ్‌YCP : అద్దంకి వైసీపీ ఇన్చార్జిగా ఆ యువనేత!

YCP : అద్దంకి వైసీపీ ఇన్చార్జిగా ఆ యువనేత!

YCP : ప్రకాశం జిల్లా( Prakasam district) రాజకీయాలపై దృష్టి పెట్టారు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా అద్దంకి, చీరాల నియోజకవర్గాలను సెట్ చేసే పనిలో పడ్డారు. అక్కడ సమర్థవంతమైన నాయకత్వాలను బరిలోదించాలని చూస్తున్నారు. ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గంలో ఓ యువనేతకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గానికి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం కూటమి క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన దూకుడును తట్టుకొని నిలబడే నేత కోసం అన్వేషించారు జగన్. చివరకు గొట్టిపాటి రవికుమార్ సామాజిక వర్గానికి చెందిన నేతను తెరపైకి తెచ్చారు.

* రెండు కుటుంబాల వైరం.. అద్దంకి(Addanki )నియోజకవర్గంలో పాతుకుపోయారు గొట్టిపాటి రవికుమార్. అద్దంకి అంటే ముందుగా గుర్తుకొచ్చేది గొట్టిపాటి, కరణం కుటుంబాలే. ఈ రెండు కుటుంబాలు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య నువ్వా నేనా అన్నట్టు పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గొట్టిపాటి రవికుమార్. తెలుగుదేశంలో సుదీర్ఘకాలం కొనసాగారు కరణం బలరాం. అయితే 2009 తర్వాత అద్దంకిలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు కరణం బలరాం. 2019లో ఇదే గొట్టిపాటి రవికుమార్ కారణంగా కరణం బలరామును చీరాలకు పంపించారు చంద్రబాబు. అయితే గొట్టిపాటి రవికుమార్ టిడిపిలోకి ఎంట్రీ ఇవ్వగా.. కరణం బలరాం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఈ ఇద్దరు నేతల మధ్య దశాబ్దాల వైరం నడుస్తూనే ఉంది. అందుకే గొట్టిపాటి రవికుమార్ హవాకు చెప్పాలంటే కరణం కుటుంబం అయితే సరిపోతుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.

Also Read : వై నాట్ కుప్పం.. దెబ్బతీసిన వైసిపి అతి విశ్వాసం!

* అద్దంకిలో గొట్టిపాటి హవా..
2009 కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు గొట్టిపాటి రవికుమార్( Gotti paty Ravi Kumar). ఆ ఎన్నికల్లో కరణం బలరాం పై విజయం సాధించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు రవికుమార్. జగన్ ప్రభంజనంలో సైతం విజయం సాధించారు. అయితే అప్పటివరకు అక్కడ ఉన్న కరణం బలరామును చీరాలకు పంపించారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో జగన్ ప్రపంచాన్ని తట్టుకొని మరి గెలిచారు కరణం బలరాం. అయితే తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. 2024 ఎన్నికల్లో అద్దంకి నుంచి గెలిచిన రవికుమార్ మంత్రి అయ్యారు. కరణం బలరాం కుమారుడు వెంకటేష్ చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

* కనిపించని హనీమిరెడ్డి..
అయితే అద్దంకిలో 2024 ఎన్నికల్లో హనీమిరెడ్డి ( hanimi ready )పోటీ చేశారు. కానీ ఓటమి చవిచూశారు. ఓడిపోయిన నాటి నుంచి నియోజకవర్గ ముఖం చూడడం లేదు. దీంతో ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. దానిని సెట్ చేసే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. కరణం వెంకటేష్ కు అద్దంకి బాధ్యతలు అప్పగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే గొట్టిపాటి దూకుడుకు కొంత కళ్లెం వేయవచ్చని అంచనాకు వస్తున్నారు. అయితే కరణం బలరాం టిడిపిలోకి వెళ్తారని ప్రచారం నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. త్వరలో నియోజకవర్గ ఇన్చార్జిగా కరణం వెంకటేష్ పేరును ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతుంది.

Also Read: సాక్షిలో కనిపించని అమరావతి ప్రకటనలు!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version