Homeఆంధ్రప్రదేశ్‌Annadatta Sukhibhav : 'అన్నదాత సుఖీభవ' వారికే.. మార్గదర్శకాలు అవే!

Annadatta Sukhibhav : ‘అన్నదాత సుఖీభవ’ వారికే.. మార్గదర్శకాలు అవే!

Annadatta Sukhibhav : ఏపీ ప్రభుత్వం( AP government ) దూకుడుగా ఉంది. ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. ఈ నెలలోనే రెండు కీలకమైన పథకాలకు శ్రీకారం చుట్టనుంది. గత నెలలో మత్స్యకార భరోసా అందించింది. మే నెలలో అన్నదాత సుఖీభవతో పాటు తల్లికి వందనం పథకాలను అమలు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం జరగనుంది. పలు ప్రధాన అంశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనుంది. అమరావతిలో పనులపై సీఆర్డీఏ నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాల అమలుపై నిర్ణయం తీసుకోవడంతో పాటు మార్గదర్శకాలు పైన చర్చ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులకు మంత్రివర్గం అభినందించనుంది.

Also Read: కూటమిపై విష ప్రచారం.. ప్రత్యేక బృందం వ్యూహం!

* ప్రతి 15 రోజులకు సమావేశం..
ఏపీలో కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆనవాయితీ కొనసాగుతోంది. ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ భేటీ జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధానంగా మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మరోసారి దిశ నిర్దేశం చేయనున్నారు. ఇటీవల అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ప్రధాని మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపనున్నారు. 47వ సిఆర్డిఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అయితే ప్రధాన అజెండాగా మాత్రం అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం మార్గదర్శకాలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విద్యా సంవత్సరానికి ప్రారంభానికి ముందే తల్లికి వందనం కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంగా ఉంది. ఈ రెండు పథకాల అమలుపైనే ఈరోజు మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది.

* మూడు విడతలుగా సాయం..
తాము అధికారంలోకి వస్తే ఏటా సాగు సాయాని కింద 20వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు ( CM Chandrababu)హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీని అమలు చేసేందుకు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని మూడు విడతలుగా రైతులకు అందించనున్నారు. కౌలు రైతులకు కూడా వర్తింపజేశారు. ఇప్పటికే కేంద్రం పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో నిధులు అందిస్తోంది. వాటితో పాటు అన్నదాత సుఖీభవ కూడా అందించనున్నారు. ఈ పథకం అర్హతల పైన ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం పై తుది నిర్ణయం తీసుకున్నారు. ఉద్యానవనం, పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు సాగు చేసే వారు కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు.

Also Read : వైసీపీకి ఆ ఇద్దరు నేతలు షాక్!

* మార్గదర్శకాలపై చర్చ..
అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) పథకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. పదివేల రూపాయలకు పైగా పెన్షన్ పొందేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, పదవుల్లో ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. ఆర్థికంగా రైతులకు మద్దతుగా నిలిచేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అందుకే ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టలు, ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అనర్హులు. గత ఏడాది పన్ను చెల్లించిన వారికి సైతం పథకం అమలు కాదు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చిన ఈ పథకానికి అనర్హులుగా అధికారులు ప్రతిపాదించారు. మరి మంత్రివర్గంలో తుది మార్గదర్శకాలు వెల్లడించే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version