Homeఆంధ్రప్రదేశ్‌YCP: వై నాట్ కుప్పం.. దెబ్బతీసిన వైసిపి అతి విశ్వాసం!

YCP: వై నాట్ కుప్పం.. దెబ్బతీసిన వైసిపి అతి విశ్వాసం!

YCP: వై నాట్ కుప్పం.. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో వినిపించిన మాట ఇది. కుప్పంలో చంద్రబాబును సైతం 2024లో ఓడిస్తామని గంటాపధంగా చెప్పారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. దానికి కారణం లేకపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీని ఒక వ్యూహాత్మకంగా దెబ్బతీసింది. అప్పటినుంచి కుప్పం తో పాటు వై నాట్ 175 అన్న నినాదాన్ని కూడా బలంగా తీసుకెళ్లింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే స్థానిక సంస్థల గెలుపు కాదు.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఆలోచన సరళి మారుతుందని అంచనా వేయలేకపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. విశ్వాసం, అతి విశ్వాసానికి మించి.. మరింత అతి చేసింది. దానికి మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు అదే కుప్పం టిడిపికి దాసోహం అవుతోంది. కుప్పంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం నీటి బుడగగా తేలిపోయింది.

* మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల్లో టిడిపి విజయం..
మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల్లో టిడిపి గెలిచింది కుప్పంలో( Kuppam ). గత ఏడాది కుప్పం మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సుధీర్ రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. 2021 లో జరిగిన కుప్పం మున్సిపల్ తొలి ఎన్నికల్లో వైసిపి విజయం సాధించింది. 2019లో మేజర్ పంచాయితీగా ఉన్న కుప్పంను మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం 25 వార్డులకు గాను 19 చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో వై నాట్ 175 అన్న నినాదం తెరపైకి వచ్చింది.

* చంద్రబాబు హవాకు బ్రేక్..
కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు చంద్రబాబు( CM Chandrababu). ఎప్పుడు భారీ మెజారిటీ నమోదు అవుతూ వస్తోంది. అటువంటిది 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంతో అమాంతం మెజారిటీ పడిపోయింది. పైగా చంద్రబాబును నిర్వీర్యం చేయడం ద్వారా రాజకీయంగా దెబ్బతీయవచ్చని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఆ బాధ్యతను సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. దీంతో తన పుంగనూరు నియోజకవర్గాన్ని వదిలి ఎక్కువగా కుప్పంపై దృష్టి పెట్టారు పెద్దిరెడ్డి. అన్ని రకాల ప్రయోగాలు చేశారు. దీంతో నియోజకవర్గంలోని అన్ని పంచాయితీల్లో వైసిపి పాగా వేసింది. అంతటితో ఆగకుండా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని ప్రాదేశిక ఎన్నికల్లో కూడా వైసిపి సత్తా చాటింది. తొలిసారిగా మున్సిపాలిటీగా అవతరించిన కుప్పంను కైవసం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

* సార్వత్రిక ఎన్నికల్లో దెబ్బతీసిన ప్రజలు..
అయితే 2024 సాధారణ ఎన్నికలకు( general elections ) వచ్చేసరికి ప్రజల మూడ్ మారింది. అప్పటివరకు ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా మార్పు కనిపించింది. అప్పటివరకు తమ చేతుల్లో ఎన్నికలు నిర్వహిస్తూ ప్రలోభాల పర్వం నడిచింది. కానీ సాధారణ ఎన్నికల్లో తిరిగి చంద్రబాబు నాయకత్వాన్ని కుప్పం నియోజకవర్గ ప్రజలు కోరుకున్నారు. అయితే వై నాట్ కుప్పం అని సౌండ్ చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ చేసేలా తీర్పు ఇచ్చారు కుప్పం ప్రజలు. అటు స్థానిక సంస్థల ప్రతినిధులు సైతం స్వచ్ఛందంగా టిడిపికి సరెండర్ అయ్యారు. దీంతో క్రమేపి స్థానిక సంస్థలు కూడా టిడిపి ఆధీనంలోకి వచ్చాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version