Maharashtra Election 2024: దేశంలో మరో నెల రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్నాయి. రెండు అసెంబ్లీ పదవీకాలం త్వరలో పూర్తికానుండడంతో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నామినేషన్లు స్వీకరిస్తోంది. వీటిటోపాటు దేశంలో 40 అసెంబ్లీ స్థానాలకు, రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనుంది. రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. జార్ఖండ్‌లో అధికార జేఎంఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ ఒంటరిగా బరిలో దిగుతోంది. ఇక మహారాష్ట్రలో బీజేపీ–శివసేన చీలికవర్గం, ఎన్‌సీపీ చీలివర్గం కలిసి మహాయుతి కూటమిగా పోటీ చేస్తున్నాయి. మరోవైపు ఎన్‌సీపీ శరద్‌పవార్ వర్గం, కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం పొత్తుకు ప్రయత్నిస్తున్నాయి. చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఉద్ధవ్ వర్గం బీజేపీతో కలిసిపోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నిలకనామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మహాయుతి కూటమికి చెందిన మూడు పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశాయి. మరోవైపు ఉద్ధవ్ వర్గం 65 మంది అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో అధికారం ఎవరిది అని తెలుసుకునేందుకు ఆర్‌ఎస్‌ఎస్ అంతర్గత సర్వే నిర్వహించింది.
అధికారం కూటమిదే..
మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ అంచనా వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో మహరాష్ట్రలో బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. కానీ, నాటి వ్యతిరేకత ప్రస్తుతం లేదని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో మహాయుతి కూటమి 160 సీట్లు సాధిస్తుందని అంచానా వేసింది. 288 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మహాయుతి కూటమి స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని అంతర్గత సర్వే ద్వారా అంచనాకు వచ్చింది. అక్టోబర్ 2వ వారంలో ఈ సర్వే నిర్వహించింది.
బీజేపీ వైపు ఉద్ధవ్ చూపు
ఇదిలా ఉంటే.. మహా రాష్ట్రలో బీజేపీ కూటమి వైపు ఉద్ధవ్‌థాక్రే నేతృత్వంలోని శివసేన కూడా చూస్తోందని తెలుస్తోంది. ఎన్‌సీపీ, కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీలు కాకపోయినా, ముస్లిం అనుకూల పార్టీలు. శివసేన పూర్తిగా హిందుత్వ పార్టీ. హిందుత్వమే లక్ష్యంగా బాల్‌థాక్రే ఈ పార్టీని ప్రారంభించారు. చాలాకాలం ఎన్నికలకు దూరంగా ఉన్నా.. మహారాష్ట్ర రాజకీయాలను నిర్ధేశించారు. ఆయన మరణం తర్వాత శివసేన ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగుతోంది. ఉద్ధవ్ థాక్రే సీఎం పదవి కోసం బీజేపీని కాదని, కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. కానీ, ఈ కూటమి ప్రభుత్వం ఏడాదికే కూలిపోయింది. ఏక్‌నాథ్‌షిండే శివసేనను చీల్చి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మరాఠాలు శివసేన, కాంగ్రెస్ పొత్తును అంగీకరించరనే భావనలో ఉద్ధవ్ థాక్రే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో మహాయుతి కూటమితో కలిపి పనిచేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తర్వాత అయినా కలిసే అవకాశం ఉందని సమాచారం.
పార్టీల వారీగా సీట్లు..
ఇక ఆర్‌ఎస్‌ఎస్ సర్వే ప్రకారం.. బీజేపీ 90 నుంచి 95 సీట్లు, షిడే శివసేన 40 నుంచి 50 సీట్లు, అజిత్‌పవార్ ఎన్‌సీపీ 25 నుంచి 30 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లకే పరిమితమైంది. యూపీ, రాజస్థాన్, బెంగాల్‌తోపాటు మహారాష్ట్రలో భారీగా స్థానాలు కోల్పోయింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించలేదు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.