https://oktelugu.com/

YCP: తప్పు మీది.. మాపై నెడతారా.. పోలవరం పై వైసీపీ స్ట్రాంగ్ రియాక్షన్

డయా ఫ్రమ్ వాల్ ను నిర్మించి టిడిపి ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసిందన్నది వైసిపి నుంచి వినిపిస్తున్న మాట. స్పిల్ వే ఛానల్, అప్రోచ్ ఛానల్, నది డైవర్షన్ పూర్తికాకుండా కాపర్ డ్యాంను ఎలా ప్రారంభించారని నిలదీస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 29, 2024 / 01:08 PM IST

    YCP

    Follow us on

    YCP: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్వేత పత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తప్పంతా జగన్ దేనని ఆరోపించిన సంగతి విధితమే. దీంతో ఇదొక పొలిటికల్ అంశంగా మారింది. దీనిపై వైసీపీ నుంచి రియాక్ట్ ప్రారంభమైంది. శ్వేత పత్రంలో ఉన్నవన్నీ అబద్ధాలేనని.. చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారని కూడా వైసీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. దీనిని ఒక డ్రామాగా అభివర్ణిస్తున్నారు.

    డయా ఫ్రమ్ వాల్ ను నిర్మించి టిడిపి ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసిందన్నది వైసిపి నుంచి వినిపిస్తున్న మాట. స్పిల్ వే ఛానల్, అప్రోచ్ ఛానల్, నది డైవర్షన్ పూర్తికాకుండా కాపర్ డ్యాంను ఎలా ప్రారంభించారని నిలదీస్తున్నారు. అసలు డయా ఫ్రమ్ వాల్ ను ఎలా నిర్మిస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టుని.. చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. కేవలం నిధులు, కమిషన్ కొట్టేసేందుకే ఈ ప్రాజెక్టును టేకోవర్ చేసుకున్నారని మండిపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలో వాడుకుంటున్నారని గతంలో ప్రధాని మోదీ చేసిన విమర్శలను గుర్తు చేస్తున్నారు. పాత వీడియోలన్నీ చంద్రబాబు స్క్రీన్ పై చూపిస్తున్నారని.. కానీ 2018 లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామన్న అప్పటి మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యలను ఎందుకు చూపడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు. వైసిపి ఓడిపోయింది కాబట్టి.. బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నది వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట.

    అయితే వైసీపీ నుంచి తాజా మాజీ మంత్రి అంబటి రాంబాబు ముందుగా స్పందించారు. చంద్రబాబు శ్వేత పత్రాన్ని తప్పుపట్టారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే వారి హయాంలో పోలవరం పూర్తయ్యేలా లేదని కూడా కామెంట్స్ చేశారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారని ధీమా కనబరిచారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ సమయంలో కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. కేవలం జగన్ ను ప్రజల్లో చులకన చేసేందుకే శ్వేత పత్రం విడుదల చేశారని చెప్పుకొచ్చారు అంబటి. నాలుగో సారి సీఎం అయ్యాక చంద్రబాబులో అహం పెరిగిందని కూడా హాట్ కామెంట్స్ చేశారు.

    ప్రస్తుతానికి పోలవరం ఇష్యూ ప్రధాన రాజకీయ అంశం గా మారిపోయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ను ప్రాధాన్యత ప్రాజెక్టుగా తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతి తో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అందుకే ఇప్పటివరకు జరిగిన నిర్మాణాల విషయంలో జగన్ కు ఎటువంటి క్రెడిట్ దక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే స్వేత పత్రం విడుదల చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ రియాక్ట్ కావడంతో.. టిడిపి నుంచి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.