YCP : వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి మరో నేత గుడ్ బై చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది నేతలు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలతో పాటు పార్టీలో నెంబర్ 2 గా ఎదిగిన వారు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే గత కొద్దిరోజులుగా దీనికి బ్రేక్ పడింది. అయితే తాజాగా ఓ మహిళ ఎమ్మెల్సీ పార్టీకి గుడ్ బై చెప్పారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ మేరకు తన వ్యక్తిగత సిబ్బందితో శాసనమండలి చైర్మన్ కు రాజీనామా లేఖ పంపారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తే మాత్రం డిప్యూటీ చైర్మన్ పదవి పోతుంది.
Also Read : వై నాట్ కుప్పం.. ఆ స్లోగన్ ఇప్పుడు రివర్స్!
* గవర్నర్ కోటా కింద ఎంపిక
జకియా ఖానం( jakiya Khanum ) సొంత జిల్లా కడప. రాయచోటి నియోజకవర్గానికి చెందిన ఆమె 2020 జూలైలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. జయ మంగళం వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, పోతుల సునీతాలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే వారి రాజీనామాలను ఇంతవరకు ఆమోదానికి నోచుకోలేదు. వారి రాజీనామాలు ఆమోదం పొందితే ఆ ఆరు ఎమ్మెల్సీలు కూటమి ఖాతాలో పడే అవకాశం ఉంది.
* టిడిపిలో చేరే అవకాశం..
జకియా ఖానం తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) చేరే అవకాశం ఉంది. గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటూ వచ్చారు. ఓసారి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేష్ ను కలిశారు. యువ నేతను సన్మానించారు. అప్పుడే ఆమె టిడిపిలో చేరతారని పెద్దగా ప్రచారం జరిగింది. అయితే ఇంతలో టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించిన సిఫార్సు లేఖ వివాదం చుట్టుకున్న సంగతి తెలిసిందే. ఆమె సిఫారసు లేఖను ఓ భక్తుడికి అధిక ధరకు అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు కూడా నమోదయింది. బెంగళూరుకు చెందిన సాయికుమార్ అనే భక్తుడు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కేసు నమోదయింది. అయితే అటు తరువాత ఆమె ఎక్కడ బయటకు కనిపించలేదు. కానీ ఈరోజు ఉన్నపలంగా రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరి ఆమె ఏ పార్టీలో చేరుతారో? ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో? చూడాలి.
Also Read : ఆ బెదిరింపు ప్రకటనలతో వైసిపికే నష్టం!