Homeఆంధ్రప్రదేశ్‌Peddireddy and Pawan Kalyan : పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూ ఉచ్చు బిగించేసిన పవన్.....

Peddireddy and Pawan Kalyan : పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూ ఉచ్చు బిగించేసిన పవన్.. కీలక ఆదేశాలు

Peddireddy and Pawan Kalyan : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) సీనియర్ నేత పెద్దిరెడ్డి ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? రామచంద్రారెడ్డి అరెస్టు తప్పదా? అటవీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారా? కఠిన చర్యలకు ఆదేశించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణ, బుగ్గ మఠం భూముల ఆక్రమణ పై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటవీ భూములను ఆక్రమించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అటవీ చట్టాల ప్రకారం ఈ కేసులు నమోదు చేయాలని కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

Also Read : మావోయిస్టుల అడ్డాకు పవన్… రెండు రోజుల పాటు ఆ ప్రాంతాల్లోనే!

* వైసిపి హయాంలో హవా
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీనియర్ మంత్రిగా ఉండేవారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy) . పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన జగన్ సర్కార్ లో ఐదేళ్ల పాటు పూర్తిస్థాయి మంత్రిగా వ్యవహరించారు. ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. అదే సమయంలో రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబాలపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చారు. మొత్తం రాయలసీమ రాజకీయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో నడిచేవి. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా బుగ్గ మఠం భూముల ఆక్రమణలో పెద్దిరెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల పాత్ర ఉందని ఆరోపణలు వినిపించాయి. దీనిపై గత కొద్ది రోజులుగా మీడియాలో పతాక స్థాయిలో కథనాలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ భూముల వ్యవహారంపై దృష్టి పెట్టారు.

* అధికారులపై శాఖాపరమైన చర్యలు
అయితే అటవీ భూముల ఆక్రమణ జరుగుతుంటే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. దీనిపై కూడా స్పందించారు పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan). పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములను ఆక్రమిస్తుంటే.. అడ్డుకోలేకపోయిన అధికారులను గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు డిప్యూటీ సీఎం. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అటవీ భూములపై దృష్టి పెట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డీజీ విచారణ కూడా చేపట్టారు. ఆ నివేదికను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని.. భూములు ఆక్రమణలకు గురవుతుంటే రక్షించలేని అధికారులను బాధ్యులను చేయాలని డీజీ సిఫార్సు చేశారు. నివేదికను పరిశీలించిన పవన్ కళ్యాణ్ అటవీ భూముల ఆక్రమణ పై ఉన్నతాధికారులతో చర్చించారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించారు.

Also Read : ఏపీ సిఐడికి సుప్రీం కోర్ట్ షాక్!

* కేసులతో ఉక్కిరి బిక్కిరి..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి కుటుంబ హవా నడిచింది అన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన అరెస్ట్ తప్పకుండా జరుగుతుందని ప్రచారం సాగింది. దీంతో మిధున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో మిధున్ రెడ్డికి కొంత ఉపశమనం దక్కినట్లు అయింది. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular