https://oktelugu.com/

Keshineni Nani : కేశినేని నానికి వైసీపీ గ్రీన్ సిగ్నల్

ఇప్పటికే రెండు ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు విషయంలో వైసీపీకి చుక్కెదురయ్యింది. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని తిప్పుకుంటే వర్కవుట్ అవుతుందన్న ఆలోచనలో వైసీపీ పడినట్టుందని తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో?

Written By: , Updated On : May 31, 2023 / 06:03 PM IST
Follow us on

Keshineni Nani : విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒక నిర్ణయానికి వచ్చేశారా? పార్టీలో మారేందుకు సిద్ధపడుతున్నారా? వైసీపీ సైతం సాదరంగా ఆహ్వానిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి సానుకూలంగా స్పందించారు. కేశినేని నాని వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు. నిప్పులేనిదే పొగ రాదు కాబట్టి నాని సైతం పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు పొలిటికల్ సర్కిల్ లో చక్కెర్లు కొడుతున్నాయి. ఆయన స్ట్రాంగ్ గా డిసైడయ్యారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గత కొద్దిరోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కేశినేని నాని అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. చంద్రబాబుతో సైతం మునపటి సంబంధాలు తగ్గిపోయాయి. అటు నాని వ్యతిరేక శిబిరంలోని బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, దేవినేని ఉమా నుంచి కూడా ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. వారితో పొసగడం లేదు. ఆ రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. కేశినేని నాని వ్యవహార శైలిపై చంద్రబాబుకు ఫిర్యాదులు వస్తున్నాయి. పంచాయితీ చేసేందుకు ప్రయత్నించినా నాని పెద్దగా వినడం లేదు. ఎప్పటికప్పుడు అలక, అసంతృప్తి, అనుచిత వ్యాఖ్యలతో చిరాకు తెప్పిస్తున్నా చంద్రబాబు లైట్ తీసుకుంటూ వస్తున్నారు.

తొలుత కేశినేని నాని టీడీపీకి రాజీమానా చేసి బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. దాన్ని ఎంపీ ఖండించారు. అప్పటి నుండి పార్టీ మారే విషయంలో ఎంపీ పై ఎలాంటి వార్తలు లేవు.  కానీ ఇటీవల ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని చంద్రబాబు బాగా ప్రోత్సహిస్తున్నారు. నాని వ్యవహార శైలితో చికాకు పెడుతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా చంద్రబాబు జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది. సహజంగా ఇది నానికి మింగుడుపడడం లేదు. తన సొంత తమ్ముడికి ఎంపీ సీటు ఇచ్చినా సహకరించేది లేదని తెల్చిచెప్పేశారు. తనకు పార్టీతో పనిలేదని.. ఆఫీసులో ఉండి సేవలందించుకోలగనని సవాల్ చేశారు కూడా.

ఇటీవల నాని వ్యవహార శైలి మరింత ముదురుతోంది. వైసీపీకి చెందిన నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో  సన్నిహితంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కు పిలిస్తే హాజరయ్యారు. అప్పటినుండి ఎంపీకి వ్యతిరేకంగా పార్టీలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దీనికి అదనంగానే కేశినేని పార్టీలో కి  వస్తే ఆహ్వానిస్తామని తాజాగా వైసీపీ ఎంపీ  అయోధ్య రామిరెడ్డి  చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.  ఇటు నుంచి నాని సంకేతాలు పంపించేసరికి వైసీపీ అలెర్ట్ అయ్యిందని భావిస్తున్నారు. ఇప్పటికే రెండు ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు విషయంలో వైసీపీకి చుక్కెదురయ్యింది. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని తిప్పుకుంటే వర్కవుట్ అవుతుందన్న ఆలోచనలో వైసీపీ పడినట్టుందని తెలుస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో?