Sajjala  Ramakrishna Reddy : ఆ మీడియాపై సజ్జల చిందులు

ఆ సెక్షన్ ఆఫ్ మీడియాను అటాకర్ గ్యాంగ్ తో సజ్జల పోల్చారు. వీరిది పొలిటికల్ అజెండాయేనని.. టీడీపీకి  రాజకీయ జెండా సెట్ చేయడమే ఈ మీడియా పని అని సజ్జల ధ్వజమోత్తారు.

Written By: Dharma, Updated On : May 31, 2023 6:09 pm
Follow us on

Sajjala  Ramakrishna Reddy : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. అరెస్టు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు కావడం ఉపశమనం కలిగించే విషయమే.. గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఎపిసోడ్ లో అవినాష్ అరెస్టుతో సంచలనాలు నమోదుకానున్నాయని సీబీఐ సంకేతాలిచ్చింది. దీంతో వైసీపీ శిబిరంలో కలవరం ప్రారంభమైంది. నాటకీయ పరిణామాల మధ్య సుప్రీం కోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో వైసీపీ శిబిరం ఊపిరిపీల్చుకుంది. దీనిపై వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిల్ సర్వసాధరణమే అయినా.. వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాలతో ప్రత్యేకంగా మాట్లాడాల్సి వస్తోందని సజ్జల అన్నారు. ఈ కేసు విచారణలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అతిగా స్పందించిన విషయాన్ని గుర్తుచేశారు. సీబీఐ దర్యాప్తును కూడా ప్రభావితం చేసేలా, సమాంతరంగా దర్యాప్తులు జరపడం, జగన్ కు వ్యతిరేకంగా కథనాలను వండి వార్చడంపై సజ్జల ధ్వజమెత్తారు. మీడియా పరిధి దాటి వ్యవహరించిన తీరుపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి తన తీర్పులో పొందుపరచిన విషయాన్ని గుర్తుచేశారు. న్యాయమూర్తులపై దురుద్దేశాలు ఆపాదించడం.. ఒక దశలో ఈ కేసు నుంచి జడ్జిని తప్పుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

ఆ సెక్షన్ ఆఫ్ మీడియాను అటాకర్ గ్యాంగ్ తో సజ్జల పోల్చారు. వీరిది పొలిటికల్ అజెండాయేనని.. టీడీపీకి  రాజకీయ జెండా సెట్ చేయడమే ఈ మీడియా పని అని సజ్జల ధ్వజమోత్తారు.ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు ఏ రాష్ట్రంలో కూడా ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. మీడియా తన పరిధులను దాటిందనే విషయం ప్రజలకు తెలిసిన విషయమేనని పేర్కొన్నారు. చంద్రబాబు కూడా ఆ గ్యాంగ్ చేతిలో పావులాంటివాడేననేది అర్థమౌతోందని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన, అజెండా తెలుగుదేశం పార్టీకి ఎలాగూ లేకుండాపోయిందని, ఈ మీడియా గ్యాంగ్ చెబుతున్నదే  పాటిస్తోందని ఆరోపించారు. జగన్ ను ప్రజాక్షేత్రంలో అడ్డుకోలేక ఈ విధమైన దారుణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అటాకర్ గ్యాంగ్ తో పోల్చుతూనే సజ్జల తనదైన శైలిలో అటాక్ చేశారు.