https://oktelugu.com/

Malli Pelli Closing Collections: ‘మళ్ళీ పెళ్లి’ క్లోసింగ్ కలెక్షన్స్.. వచ్చిన వసూళ్లతో ప్లేట్ మీల్స్ కూడా కొనుక్కోలేరు!

కొంతకాలం నుండి డేటింగ్ చేస్తూ రీసెంట్ గానే పెళ్లి ద్వారా ఒక్కటైనా ఈ ఇద్దరు, తమ లవ్ స్టోరీ కి సంబంధించిన సినిమా గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడమే కాకుండా, నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతి ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాలో ఎన్నో సన్నివేశాలు పెట్టాడు. నెగటివ్ పబ్లిసిటీ ద్వారా వసూళ్లు వస్తాయేమో అని అనుకున్నాడు. వచ్చినా రాకపోయినా పర్వాలేదు అని విడుదల చేసిన ఈ చిత్రానికి క్లోసింగ్ లో ఎంత వసూలు వచ్చాయో ఒకసారి చూద్దాము.

Written By:
  • Vicky
  • , Updated On : May 31, 2023 / 05:59 PM IST

    Malli Pelli Closing Collections

    Follow us on

    Malli Pelli Closing Collections: ఎవరైనా సినిమాలను జనాలను ఎంటర్టైన్మెంట్ చెయ్యడం కోసం తీస్తారు, కొంతమంది కేవలం కమర్షియల్ దారిలో వెళ్లి డబ్బుల కోసం, లాభాల కోసమే సినిమాలు తీస్తారు. ఈ రెండు క్యాటగిరీలకు సంబంధం లేకుండా కొంతమంది ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ తన అహం ని చూయించుకునే ప్రయత్నం లో సినిమాలు తీస్తుంటారు. రీసెంట్ గా సీనియర్ నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘మళ్ళీ పెళ్లి’ సినిమా అలాంటిదే.

    కొంతకాలం నుండి డేటింగ్ చేస్తూ రీసెంట్ గానే పెళ్లి ద్వారా ఒక్కటైనా ఈ ఇద్దరు, తమ లవ్ స్టోరీ కి సంబంధించిన సినిమా గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడమే కాకుండా, నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతి ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాలో ఎన్నో సన్నివేశాలు పెట్టాడు. నెగటివ్ పబ్లిసిటీ ద్వారా వసూళ్లు వస్తాయేమో అని అనుకున్నాడు. వచ్చినా రాకపోయినా పర్వాలేదు అని విడుదల చేసిన ఈ చిత్రానికి క్లోసింగ్ లో ఎంత వసూలు వచ్చాయో ఒకసారి చూద్దాము.

    మొదటి రోజు ఈ చిత్రానికి దాదాపుగా 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, రెండవ రోజు నుండి వేల సంఖ్యలోనే కలెక్షన్స్ వచ్చాయి. దీనితో వచ్చిన 40 లక్షల రూపాయిల గ్రాస్ లో థియేటర్స్ రెంట్స్ , టాక్స్ మరియు GST తీసివేయ్యగా, ఈ చిత్రానికి మిగిలిన షేర్ సున్నా. కనీసం బయ్యర్స్ కి ప్లేట్ మీల్స్ కొనుక్కునేంత వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనే విషయం.

    కానీ డిజిటల్ + సాటిలైట్ రైట్స్ రూపం లో ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ మొత్తం నరేష్ కి రీ కవర్ అయిపోయిందని, ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. జూన్ రెండవ వారం లో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
    Recommended Video: