YCP: ఏపీలో( Andhra Pradesh) రాజకీయం ఆసక్తిగా మారుతుంది. ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య చక్కటి సమన్వయం కొనసాగుతోంది. ఇది ఎంత మాత్రం రుచించడం లేదు జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వారికి. ఆయన మంచి కోరే వారు చాలామంది తటస్తులుగా ఉన్నారు. వారు సైతం కూటమిగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి లాభం లేదని తేల్చేస్తున్నారు. అందుకే కూటమి పార్టీలు విడిపోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. సాక్షి మీడియాతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా సైనికుల వలే పని చేస్తున్నారు కూటమి పార్టీల మధ్య గొడవల కోసం. జన సైనికులపై సానుభూతి చూపుతూ టిడిపి పై రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు జనసేన ముసుగులో. కానీ కూటమిలో కింది స్థాయి శ్రేణులు ఏవేవో విభేదాలు చూపుతున్నాయి తప్ప.. నాయకత్వంలో నిర్ణయంలో ఎంత మాత్రం మార్పు లేదు. మరో 15 సంవత్సరాలు పాటు కూటమి కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ ఇదివరకే చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబుతో పాటు లోకేష్ అదే మాట చెబుతుండడంతో జగన్ సన్నిహితులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
* మారని పవన్ అభిప్రాయం..
తాజాగా పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) తమిళనాడు వెళ్లి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలకు ముందు ఎన్నో రకాల సమస్యల నడుమ ధర్మం వైపు నిలబడ్డానని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా నిర్ణయం కీలకంగా మారిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పుడే కాదు అన్నివేళలా పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని చెబుతున్నారు. కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. కూటమిలో నాయకత్వం విషయంలో పక్కన పెడితే.. ఎవరు నాయకత్వం వహిస్తారన్న ప్రశ్న తలెత్తకుండా.. మేము గొప్ప మీరు గొప్ప అన్న తేడా లేకుండా దాదాపు ఏడాదిన్నర పాలనను సజావుగా ముందుకు తీసుకెళ్లారు. తమ మధ్య పొత్తు విచ్ఛిన్నం కాదు అని సంకేతాలు పంపగలరు. తమ మధ్య విభేదాలు వచ్చే అవకాశం లేదని.. క్షేత్రస్థాయిలో కిందిస్థాయిలో పార్టీ నేతల మధ్య విభేదాలు వచ్చిన పట్టించుకోమని సంకేతాలు పంపుతున్నారు మూడు పార్టీల నాయకులు.
* జగన్మోహన్ రెడ్డికి హితబోధ..
అయితే ఎట్టి పరిస్థితుల్లో మూడు పార్టీల మధ్య పొత్తు చెదరదని వైసీపీ( YSR Congress party ) సన్నిహితులకు అర్థమయింది. తటస్తుల రూపంలో చాలామంది జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు బయట ఉన్నారు. వారంతా కూటమి మధ్య విరుగుడు రావాలని బలంగా కోరుకుంటూ వస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో విడిపోమని కూటమి కీలక నేతల నుంచి సంకేతాలు వస్తుండడంతో వారికి మింగుడు పడటం లేదు. మొన్నటి వరకు చంద్రబాబును వ్యతిరేకించి పవన్ కళ్యాణ్ ను అందలం ఎక్కించే విశ్లేషకులు ఉన్నారు. సలహాల రూపంలో పవన్ కళ్యాణ్ కు నూరి పోస్తే ఏదో విధంగా ఆయన బయటకు వస్తాడని భావించారు. కానీ వారి ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కావడం లేదు. ఎంతసేపు దిగువ స్థాయిలో చేస్తున్నా ఆ ప్రభావం కూటమిపై పడడం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డికి వారు నేరుగా హితబోధ చేస్తున్నారు. కూటమి మధ్య విభేదాలపై దృష్టి పెట్టకుండా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. అయినా సరే అది చాలా కష్టమైన పని అని కూడా వారు తేల్చి చెబుతుండడం విశేషం.