YS Jagan Mohan Reddy : రాజకీయ నేతలకు( political leaders) డ్రెస్సింగ్ స్టైల్ ప్రత్యేక గుర్తింపు తెస్తుంది. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముందు వరుసలో ఉంటారు. డ్రెస్సింగ్ ఎంపికకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అంతలా ప్రాధాన్యం ఇస్తుంటారు నరేంద్రమోదీ. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రెస్ కోడ్ సైతం ఒకేలా ఉంటుంది. అదే ఆయనకు ప్రత్యేక గుర్తింపు. మరోవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డ్రెస్ కోడ్ సైతం చాలా సింపుల్ గా ఉంటుంది. అయితే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత డ్రెస్ కోడ్ మార్చడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : సెలవులొచ్చాయి.. ‘బాబు’ చేసిన ఈ పని మాత్రం మెచ్చుకోవాల్సిందే
* గతంలో విభిన్న రకాల్లో
రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) వివిధ రకాల దుస్తులు ధరించేవారు. అయితే పూర్తిస్థాయిలో రాజకీయాల్లో వచ్చిన తర్వాత.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన డ్రెస్ కోడ్ మరింత మారుతూ వచ్చింది. ఒకే రకమైన దుస్తులు ధరిస్తూ వచ్చారు. తెల్లటి చొక్కా, కాకి ప్యాంటు ధరిస్తూ వచ్చారు. ఆ దుస్తుల్లోనే చాలా సింపుల్ గా, కంఫర్ట్ గా కనిపిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. బహిరంగ వేదికల వద్ద కూడా అదే డ్రస్సుతో కనిపించేవారు.
* దారుణ పరాజయంతో
..
అయితే 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) ఓడిపోయింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. దీంతో ఓటమి భారంతో ఆ పార్టీ శ్రేణులు నైరాస్యంలోకి కూరికిపోయారు. అయితే ధైర్యం పోగు చేసుకొని జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. పార్టీలో సమూల ప్రక్షాళన తీసుకొచ్చారు. కొత్త నియామకాలు చేపడుతున్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు.
* తెల్లటి కుర్తా షర్టుతో..
మరోవైపు జగన్ డ్రెస్ కోడ్( dress code) సైతం మారింది. కొత్త అవతారంలో ఆయన కనిపిస్తున్నారు. తెల్లటి కుర్తా చొక్కాతో కనిపిస్తున్న ఆ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుస్తులు ధరించడం కొత్త కాదని.. ఇంటి వద్ద ఉన్నప్పుడు అటువంటి దుస్తులే ధరిస్తారని తెలుస్తోంది. గతంలో యలహంక ప్యాలెస్ లో ఇదే దుస్తులతో కనిపించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ప్రజలను ఆకర్షించడంలో డ్రెస్ కోడ్ కూడా ఒకటి అని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి డ్రెస్ కోడ్ మారినట్లు సమాచారం.
Also Read : బిల్ గేట్స్ మాట్లాడనన్నారట.. అవమానాల నుంచి అందలమెక్కిన చంద్రబాబు